Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవిని ప్రేక్షకులకు చేరువ చేసిన శుభలేఖ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

హీరోకు ఎన్ని హిట్స్ ఉంటే అంత పాపులారిటీ పెరుగుతుంది. వరుస హిట్స్ ఉంటే రేంజ్ పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ గ్రాఫ్ కూడా అలా వెళ్లిందే. హీరో ఎవరైనా ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే.. ఆ వెంటనే వచ్చే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. దానిని క్యారీ చేయడం వారికి సవాలే అవుతుంది. వెంటనే ఆ స్థాయి హిట్ ఇవ్వడం చాలా కష్టం. కానీ.. చిరంజీవి దీనిని చాలాసార్లు సాధించారు. ఆయనకు మాస్ ఇమేజ్ వచ్చే ముందు భారీ ఫ్యామిలీ ఇమేజ్ ఇచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తర్వాత మళ్లీ ఫ్యామిలీ మూవీ చేసి అదేస్థాయి హిట్ అందుకున్నారు.. ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ సినిమానే ‘శుభలేఖ’. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్:  చిరంజీవిని ప్రేక్షకులకు చేరువ చేసిన శుభలేఖ

 

చిరంజీవిని తమవాడిగా..

కుటుంబం, సంసారం నేపథ్యంలో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చేస్తే.. కుటుంబంలో ఆడపిల్ల పెళ్లి, వరకట్నం, వితంతు వివాహం అనే అంశాలపై ‘శుభలేఖ’ చేశారు. అప్పట్లో ఈ సినిమా చేయడం సాహసమే. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటూ హోటల్ లో సర్వర్ గా చేయడం అప్పట్లో యువతపై ఎంతో ప్రభావం చూపింది. కట్నం సమస్యపై సినిమాలో చూపడం సమాజంలో ప్రేరణ ఇచ్చింది. వితంతు వివాహాంపై ప్రస్తావన మార్పు ఎంత ఆవశ్యకమో చెప్పింది. చలాకీ కుర్రాడిగా మూర్తి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. కుటుంబ ప్రేక్షకులకి ఈ సినిమా ఒక మార్పు, ఆలోచన అయింది. మూర్తి పాత్రలో చిరంజీవిని ప్రేక్షకులు తమ ఇంట్లో వ్యక్తిగా చూశారు. దీంతో సినిమా అద్భుత విజయం సాధించింది.

 

సినిమాలో ప్రత్యేకత అదే..

కళాతపస్వి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, వి.వి.శాస్త్రి నిర్మించారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు మాటలు రాసిన గొల్లపూడి మారుతీరావు ఈ సినిమాకూ మాటలు రాసారు. సినిమా కథాంశం తమ కుటుంబ కథలా, పాత్రలు తమ కుటుంబసభ్యుల్లా ఫీల్ కావడమే ఈ సినిమా ప్రత్యేకత. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన స్నేహితులతో కలిసి ఈ సినిమా సెకండ్ షో చూసి తెల్లవార్లూ ఈ సినిమాపై చర్చ జరిపారట. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకుంటే కట్నం తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంత ఇంపాక్ట్ ఈ సినిమా సమాజంపై చూపింది.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్:  చిరంజీవిని ప్రేక్షకులకు చేరువ చేసిన శుభలేఖ

 

చిరంజీవికి తొలి ఫిలింఫేర్..

చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వెంట వెంటనే రెండు ఫ్యామిలీ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు చిరంజీవి. అప్పటికి చిరంజీవికి మాస్ ఇమేజ్ రాకపోవడం చాలా ప్లస్ అని చెప్పాలి. చిరంజీవి ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి అంతగా వెళ్లడమే ఇందుకు నిదర్శనం. 1982 జూన్ 11న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ విడుదలైన 5వారాల వ్యవధిలో విడుదలైన ‘శుభలేఖ’ అంతే విజయం సాధించింది. చిరంజీవి అద్భుత నటనకు ఆయన కెరీర్లో తొలి ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. ‘శుభలేఖ’ సినిమా నా జీవితానికి ఎంతో మేలు చేసిందని చిరంజీవి అనేక సందర్భాల్లో చెప్పారు.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...