Switch to English

వైఎస్సార్ మరణంపై అనుమానాలు ఇంకెన్నాళ్ళు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి ఏళ్ళు గడుస్తోంది. 2009లో జరిగిన ప్రమాదమది. అది ప్రమాదమా.? లేదంటే, కుట్ర పూరితమైన ప్రమాదమా.? అన్నదానిపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే అప్పట్లో ఓ కార్పొరేట్ సంస్థపై దాడులు జరిగాయి. మళ్ళీ అదే కార్పొరేట్ సంస్థకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద పీట వేసిన విషయం విదితమే.

వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ నేతలు, వైఎస్సార్ మరణంపై అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి, ఇదొక పరమ రొటీన్ రాజకీయ వ్యూహమైపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు నేపథ్యంలో అధికార వైసీపీ విలవిల్లాడుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీబీఐ చేస్తున్న విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైఎస్సార్ మరణం వెనుక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యల్ని చేశారు.

నిజమే, వైఎస్సార్ మరణం వెనుక అనుమానాలున్నాయి. కానీ, ఇన్నేళ్ళలో వైఎస్సార్ మరణంపై సీబీఐ విచారణ జరగాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కోరలేదు.? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వమే చొరవ చూపి, వైఎస్సార్ మరణంపై సీబీఐ విచారణ దిశగా లేఖలు రాయొచ్చు. కానీ, అలా జరగడంలేదంటే, దానర్థమేంటి.?

ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు హస్తం వుందన్నది వైసీపీ ఆరోపణ. సీబీఐ విచారణ జరుగుతున్న దరిమిలా, వైసీపీ వద్ద చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి ఏమైనా ఆధారాలుంటే, ఆ ఆధారాల్ని సీబీఐకి ఇవ్వొచ్చు. అలా ఆధారాల్ని సీబీఐకి వైసీపీ ఇవ్వడంలేదంటే, చంద్రబాబుని వైసీపీ కాపాడుతున్నట్లే భావించాలేమో.!
ఏదిఏమైనా, హత్యల చుట్టూ కూడా దిక్కుమాలిన రాజకీయాలు నడవడం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ప్రత్యేకమని అనుకోవాలేమో.!

4 COMMENTS

  1. 729917 484171I dont think Ive read anything like this before. So very good to uncover somebody with some original thoughts on this topic. thank for starting this up. This site is something that is needed on the internet, someone with just a little originality. Very good job for bringing something new to the internet! 415034

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...