Switch to English

రెంటికీ చెడ్డ రేవడిలా మారిన ఉద్యోగులు.! ఫాఫం.. అనగలమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు.. అన్న భావన ప్రధాన రాజకీయ పార్టీల్లో కనిపించడంలేదు. అధికార వైసీపీది ఒకరకమైన వేధింపు.. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీది ఇంకో రకమైన బరితెగింపు.! వెరసి, అటు అధికార పక్షం అర్థం చేసుకోవట్లేదు.. ఇటు ప్రతిపక్షం జాలి చూపడంలేదు. ఉద్యోగులు మాత్రం, ‘మాకు అన్యాయం జరిగింది మొర్రో..’ అంటూ రోడ్డెక్కారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతున్నారన్నది వైఎస్ జగన్ సర్కారు వాదన. ‘మా హయాంలో అత్యద్భుతంగా ఉద్యోగుల కోర్కెలు నెరవేర్చాం. కానీ, మాకు వెన్నుపోటు పొడిచారు ఉద్యోగులు..’ అంటోంది తెలుగుదేశం పార్టీ. ఏది నిజం.?
సరే, నిజా నిజాల సంగతి పక్కన పెడదాం. అడిగినోడికీ, అడగనోడికీ.. అన్నట్టుగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పోటెత్తుతున్నాయ్. సంక్షేమ పథకాలంటేనే, ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సంక్షేమ పథకాలకు తోడు వాలంటీర్ వ్యవస్థ ఒకటి.. వెరసి, రాష్ట్ర ఖజానా ఈ భారాన్ని మోయలేకపోతోంది.

సలహాదారుల వల్ల అనండీ, అధికారంలో వున్నవారి సొంత ప్రచారం అనుకోండి.. ఏదైతేనేం, రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతున్నమాట వాస్తవం. కానీ, ఉద్యోగుల దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వ పెద్దలు ‘బీద అరుపులు’ అరుస్తున్నారు. ‘మీట నొక్కి’ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నంత చిత్తశుద్ధితో ఉద్యోగుల జీతాల విషయంలో ‘పద్ధతి’ చూపడంలేదన్న విమర్శలు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద వున్నాయి.

ఉద్యోగులు రోడ్డెక్కారు.. వారిని నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో మాత్రం ఇటు ఉద్యోగులపైనా, అటు అధికార పక్షం.. ఇంకో వైపు ప్రతిపక్షంపైనా సెటైర్లు పడుతున్నాయి. ‘సన్నాసుల్లారా ఇప్పుడు మీరు లెంపలు వేసుకుని ఏంటి లాభం.? మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో విపక్షాలు వేసిన నామినేషన్లు సక్రమంగా వున్నా కూడా తిరస్కరించారు గుర్తుందా.? ఆ రోజు బుద్ధి వుండాల్సిందిరా మీకు..’ అంటూ పచ్చ మంద, ఉద్యోగుల్ని ఎగతాళి చేస్తోంది.

అంతేనా, ‘సంక్రాంతికి కొత్త అల్లుళ్ళని పిలిచి పందెం పొట్టేళ్ళలా మేపినట్టు మేపాడు చంద్రబాబు. తిన్నది అరగక తెగ ‘నీలి’గారు. ఇప్పుడున్నోడు సంక్రాంతికి పిలిచే టైపు కాదు.. ఏకంగా శివరాత్రే. ఉదయం నుంచి ఉపవాసం, రాత్రంతా జాగారం. ఏదైనా పండగే కదా. ఇది ఇట్లాగే చేయాలంటాడు ఎంకట్రామిరెడ్డి. ఎనకా ముందూ ఎండాక గానీ తెలియలేదు.. ఎనకటోడు ఎంత గొప్పోడో..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు సెటైర్లతో. ఉద్యోగులూ ప్రజలే.. కానీ, ఆ ప్రజల్లోంచి ఉద్యోగుల పట్ల కనీసపాటి సానుభూతి కన్పించడంలేదెందుకో.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...