Switch to English

జస్ట్ ఆస్కింగ్: లిక్కర్ కిక్కు.! ఇలాగేనా మద్యనిషేధం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

అదనంగా మరో గంటపాటు రాష్ట్రంలో మద్యం దుకాణాల్ని తెరచి వుంచేలా వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి ‘తానా అంటే తందానా’ అనే బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది కదా.! అందుకే, అదనపు సమయం మద్యం దుకాణాల్ని తెరిచేలా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆ బ్యాచ్ నుంచి ‘సానుకూల’ ట్వీట్లు పోటెత్తుతున్నాయ్.

అధికారంలోకి వచ్చాక దశలవాదరీగా మద్య నియంత్రణ చేపట్టి, చివరికి మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చాక, ‘కొత్త మద్యం పాలసీ’ అంటూ, ‘ప్రభుత్వ సారాయి దుకాణాల్ని’ (ప్రభుత్వమే మద్యం విక్రయాల్ని చేపట్టడం) ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మొదట్లో మద్యం విక్రయాల సమయాన్ని తగ్గించారు. ఆ తర్వాత క్రమంగా వాటి సమయాల్ని పెంచుకుంటూ వెళ్ళారు. అప్పట్లో అడ్డగోలు బ్రాండ్ల మద్యం అందుబాటులో వుండేది. అసలు సిసలు బ్రాండ్ల మద్యం అడ్రస్ లేకుండా పోయింది. దాంతో, ‘కల్తీ మద్యం’ రాష్ట్రంలో ఏరులై పారిందన్న విమర్శలు లేకపోలేదు.

ప్రభుత్వమే తమ వైఫల్యాన్ని అంగీకరించి, బ్రాండెడ్ మద్యాన్ని అమ్మేలా నిర్ణయం తీసుకోవడం, ఇటీవలే అది అందుబాటులోకి రావడం తెలిసిన సంగతే. ఇప్పుడేమో మద్యం దుకాణాలకు అదనపు సమయాన్నిస్తూ, ‘లెక్కలు చూసుకునేందుకు’ అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. ఇలాగైతే, ఇంకో వందేళ్ళకైనా మద్య నిషేధం సాధ్యమయ్యే పనేనా.? వైఛీప్ బ్యాచ్ మాత్రం, ‘మేం మద్య నిషేధానికి కట్టుబడి వున్నాం..’ అని చెబుతోంది. ఎలా.? తాగండి, తాగి ఊగండి.. ఊగి ఛావండి.. అన్నట్టుగా మద్యాన్ని ఏరులై పారించడం ద్వారానా.? అన్న ప్రశ్నకు బులుగు బ్యాచ్ నుంచి సమాధానమే లేదు.

రెండున్నరేళ్ళలో జరగనిది.. రానున్న రెండేళ్ళలో జరుగుతుందా.? అదీ ‘ఇంటింటికీ మద్యం’ తరహాలో ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఆశతో తీసుకుంటున్న అడ్డగోలు నిర్ణయాలతో మద్య నిషేధమా.? నాన్సెన్స్.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...