పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం
సూర్యోదయం: ఉ 6:38
సూర్యాస్తమయం : సా.5:43
తిథి: పుష్య బహుళ పాడ్యమి రా.తె .6:12 నిమిషాల వరకు తదుపరి పుష్య బహుళ విదియ
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము : పుష్యమి రా.తె.6:20 వరకు తదుపరి ఆశ్లేష
కరణం: బాలవ సా.5:26 వరకు తదుపరి కౌలవ
యోగం: విష్కంభం మ.4:17 వరకు తదుపరి ప్రీతి
వర్జ్యం: మ.1:09 నుండి 2:53 వరకు
దుర్ముహూర్తం.ఉ.8:51 నుండి 9:35 వరకు తదుపరి రా.10:53 నుండి 11 :37వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:26 నుండి 1:49 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి 6:05 వరకు
అమృతఘడియలు: రా.11:37 నుండి 1:17 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:04 నుండి 12:48 వరకు
ఈరోజు. (18-01-2022) రాశి ఫలితాలు
మేషం: చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
వృషభం: కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
మిథునం: కుటుంబసభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.
సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి.
కన్య: నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది.
తుల: దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్న నాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.
వృశ్చికం: చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
ధనస్సు: చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు.
మకరం: సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.
కుంభం: చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు.దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి . వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.l
98223 953942Hey, you used to write fantastic, but the last couple of posts have been kinda boringK I miss your wonderful writings. Past couple of posts are just a bit out of track! come on! 920862