Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 26 డిసెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:29
సూర్యాస్తమయం : సా‌.5:26
తిథి: మార్గశిర బహుళ సప్తమి మ.3:35 నిమిషాల వరకు తదుపరి బహుళ అష్టమి
సంస్కృతవారం: భాను వాసరః (ఆది వారం)
నక్షత్రము : ఉత్తర. రా.1:46 వరకు తదుపరి హస్త
కరణం: బవ .3:35 వరకు
యోగం: ఆయుష్మౌన్. ఉ.7:39 వరకు తదుపరి సౌభాగ్యం తె.6:01 వరకు
వర్జ్యం: ఉ.8:57 నుండి 10:33 వరకు
దుర్ముహూర్తం: మ.3:57 నుండి 4:41 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:01 నుండి 4:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:11 నుండి 5:59 వరకు
అమృతఘడియలు: ‌రా.6:34 నుండి 8:10 వరకు
అభిజిత్ ముహూర్తం: రా.11:54 నుండి 12:38 వరకు

ఈరోజు. (26-12-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్రలాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

మిథునం: సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

కర్కాటకం: బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

కన్య: ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

తుల: చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబసభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు.

వృశ్చికం: నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనస్సు: దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కుంభం: మిత్రులతో మాటపట్టింపులు తప్పవు.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు.

మీనం: కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు, ఉద్యోగమున జీతబత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...