Switch to English

పవన్ కళ్యాణ్ మీద ఏడుపు.. ‘పచ్చ వైరస్’కి వైద్యం లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్, క్రిస్‌మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.. ఈ క్రమంలో క్రీస్తు బోధనల గురించీ, క్రీస్తు తత్వం గురించీ పేర్కొన్నారు. సినీ ప్రముఖులు కావొచ్చు, రాజకీయ ప్రముఖులు కావొచ్చు.. చాలామంది ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, వీలైతే మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పడం కొత్తేమీ కాదు.

‘అటెన్షన్ కోసం’ ఎదురుచూసే కొందరు, ఇలాంటి సందర్భాల్లోనే వివాదాల్ని రాజేయడం కూడా సర్వసాధారణమే. అలాంటి అవకాశాల కోసం కాచుక్కూర్చున్న పచ్చ వైరస్, సమాజం మొత్తాన్నీ చెడగొట్టేందుకు ప్రయత్నించడం ఇటీవలి కాలంలో మామూలు వ్యవహారంగా మారిపోయింది.

పవన్ కళ్యాణ్ చెప్పిన క్రిస్‌మస్ శుభాకాంక్షలు ఎవరికో నచ్చలేదట, అలాగని ఆ వ్యక్తి (సినీ నటి, బీజేపీ నేత కూడా) సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నవారు ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలంటూ ఉచిత సలహా పారేసింది. దాన్ని పట్టుకుని, యెల్లో మీడియా రాద్ధాంతం షురూ చేసేసింది.

చూస్తోంటే, పవన్ చెప్పిన శుభాకాంక్షల మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం ముందే అన్ని ఏర్పాట్లూ చేసుకుని, డబ్బులిచ్చి మరీ, సదరు నటితో అలా కామెంట్ చేయించినట్లుంది వ్యవహారం. ఇలాంటి వ్యవహారాలు నడపడంలో సదరు పచ్చ మీడియా దిట్ట మరి.!

దేశ ప్రధాని దగ్గర్నుంచి పలువురు బీజేపీ ప్రముఖులు క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. వాళ్ళెవరి విషయంలోనూ లేని అభ్యంతరాలు, పవన్ కళ్యాణ్ విషయంలో సదరు సినీ నటికి ఎందుకు వచ్చాయో ఏమో. ‘మానవాళి’ అని పవన్ కళ్యాణ్ తన ‘శుభాకాంక్షలు’ మెసేజ్‌లో పేర్కొనడం అభ్యంతరకరంగా తయారైందట సదరు నటికి.

ఆ సదరు నటి వున్నపళంగా హిందూత్వవాదిగా, అనేక హిందూ ధర్మ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ‘పచ్చ వైరస్’కి కనిపించిందంటే.. ఈ పైత్యాన్ని ఏమనుకోవాలి.? కరోనా వైరస్ కంటే కూడా ఈ పచ్చ వైరస్ సమాజానికి హానికరం.. అనేది ఇందుకే మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...