Switch to English

రాశి ఫలాలు: సోమవారం 27 డిసెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ 6:29
సూర్యాస్తమయం : సా‌.5:26
తిథి: మార్గశిర బహుళ అష్టమి మ.3:35 నిమిషాల వరకు తదుపరి బహుళ నవమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము : హస్త. రా.1:15 వరకు తదుపరి చిత్త
కరణం: కౌలవ.మ.2:35 వరకు
యోగం: శోభ.రా.తె.3:46 వరకు తదుపరి అతిగండ
వర్జ్యం: ఉ.9:59 నుండి 11:33 వరకు
దుర్ముహూర్తం: మ.12:18 నుండి 1:02 వరకు తదుపరి మ.2:29 నుండి 3:13 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:39 నుండి 3:01 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:12 నుండి 6:00 వరకు
అమృతఘడియలు: ‌రా.7:23 నుండి 8:57 వరకు
అభిజిత్ ముహూర్తం: రా.11:55 నుండి 12:39 వరకు

ఈరోజు (27-12-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

వృషభం: ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి.ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిథునం: ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు.

కర్కాటకం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాలు విషయంలో అనుకూలత కలుగుతుంది.

సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి.

కన్య: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహమున దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి, పాత ఋణాలు తీర్చాగలుగుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం: కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: మొండి బాకీలు వసూలవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆధరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగాఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికామౌతుంది. నూతన ఋణ యత్నాలు కలసిరావు.

కుంభం: చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని పూర్తికావు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మీనం: వృత్తి,ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల పరిష్కారమౌతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి. వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...