సంపన్న దేశాల్లో ఎక్కువమంది సంతానం కలగాలని కోరుకుంటూ ఉంటారు. అధిక జనాభా ఉన్న దేశాలు జనాభా నియంత్రణ పాటిస్తాయి. పేద దేశాలు తక్కువ సంతానానికే మొగ్గు చూపుతాయి. కానీ.. పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఓ అద్భుతం జరిగింది. ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 9మంది శిశువులకు జన్మనిచ్చింది. పుట్టినవారంతా ఆరోగ్యంగా ఉన్నారు. హాలిమా సిస్సే అనే మహిళ ఆమధ్య గర్భం దాల్చగా మొన్న మార్చిలో ఆమెను వైద్యులు పరీక్షించారు. ఆమె గర్భంలో ఏడుగురు శిశువులు ఉన్నట్టు గుర్తించారు.
దీంతో ఆమెకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తూ పర్యవేక్షించారు. ఈ మంగళవారం ఆమెకు నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసారు. అయితే.. వైద్యులను విస్మయపరుస్తూ ఆమె గర్భం నుంచి మరో ఇద్దరు శిశువులతో కలిసి మొత్తం 9మంది జన్మించారు. వీరిలో ఐదుగురు ఆడ నలుగురు మగ శిశువులు ఉన్నారు. తల్లీబిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఫాంటా సిబే ఓ ప్రటకనలో తెలిపారు. ఇంతమందికి జన్మనివ్వడం.. వారంతా ఆరోగ్యంగా ఉండటం విశేషమని వైద్యులు అంటున్నారు.
789950 71037really nice put up, i certainly really like this internet web site, keep on it 76691
416506 426535I dugg some of you post as I cogitated they were quite beneficial invaluable 364105
510320 575208As I website owner I conceive the content material here is rattling exceptional , thanks for your efforts. 761603