రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జులై 30న ఈ చిత్రం విడుదలవనుంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో 60స్ టైమ్ లైన్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ మధ్యనే విడుదల చేసిన గ్లిమ్ప్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. ఇక రాధే శ్యామ్ కు సంబంధించిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. ఎటర్నల్ లవ్ టేల్ గా చిత్ర బృందం ప్రచారం చేస్తోన్న రాధే శ్యామ్ లో ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ హైలైట్ కానుంది.
ఇక రాధే శ్యామ్ లో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉంటాయట. అలాగే ఈ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
904035 409692I like this blog very significantly so significantly great information . 757293