డైరెక్టర్ మారుతి తన కెరీర్ తొలినాళ్లలో సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలుసు. అడల్ట్ కామెడీ జోనర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు మారుతి. ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు. కెరీర్ లో ఇన్స్టెంట్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆ అటెంప్ట్ చేసిన మారుతి తర్వాత వాటి నుండి దూరంగా ఉంటున్నాడు. క్లీన్ కామెడీతో కూడా సూపర్ హిట్లు సాధించగలనని భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలతో నిరూపించాడు మారుతి.
ఇదిలా ఉండగా చాలా ఏళ్ల తర్వాత మారుతి మరోసారి అడల్ట్ కామెడీ జోనర్ ను టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నాడు ఈ దర్శకుడు. రెజీనా, పూర్ణ, ప్రగ్య జైస్వాల్ ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తారు. అయితే దీనికి కాన్సెప్ట్, డైలాగ్స్ మాత్రమే మారుతి హ్యాండిల్ చేయబోతున్నాడు. మ్యాగీ అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తాడు. పూర్తి అడల్ట్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ విడుదలయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
61830 127969Its difficult to get knowledgeable folks on this subject, but the truth is be understood as what happens you are preaching about! Thanks 271305