Switch to English

కార్గిల్ విజయానికి 21 ఏళ్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కార్గిల్ పేరు చెప్పగానే చాలా విషయాలు స్ఫురణకు వస్తాయి. స్నేహహస్తం సాచిన మనల్ని దొంగదెబ్బ తీయాలని భావించిన పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పిన సంగతి కనుల ముందు కదలాడుతుంది. సంక్లిష్ట పరిస్థితుల మధ్య 73 రోజులపాటు సాగిన ఆ యుద్ధంలో దాయాదిని మట్టికరిపించి నేటికి సరిగ్గా 21 ఏళ్లు పూర్తయ్యాయి. మంచుకొండల మాటున ఉగ్రవాదుల ముసుగులో వారితో కలిసి మనల్ని దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించిన పాక్ కు మరచిపోలేని గుణపాఠం చెప్పి, ఆ దేశం అసలు రంగును ప్రపంచం ముందు పెట్టడంలో అప్పుడు సంపూర్ణ విజయం సాధించాం.

కార్గిల్ సెక్టార్ మంచుకొండలతో నిండి ఉంటుంది. శీతాకాలంలో అక్కడ ఉండటం చాలా కష్టం. అందుకే శీతాకాలంలో కార్గిల్ సెక్టార్ లో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలని భారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు మనవాళ్లు సైనిక శిబిరాల్ని ఖాళీ చేశారు. అయితే, అదే అదనుగా మనదేశంలోకి చొరబడాలని నిర్ణయించుకున్న పాక్.. ఉగ్రవాదులతో కలిసి నియంత్రణ రేఖ దాటి మన భూభాగంలో ప్రవేశించింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక గొర్రెల కాపరులు.. భారత సైనికులకు చెప్పడంతో ఐదుగురు సైనికులు అక్కడకు వెళ్లారు. వారిని బంధించి చిత్రహింసలు పెట్టి చంపేశారు. 1999 మే 5న ఈ ఘటన చోటుచేసుకుంది.

అనంతరం కార్గిల్ లోని మన ఆయుధ శిబిరాన్ని పాక్ ఆర్మీ ధ్వంసం చేసింది. ద్రాస్, కక్సర్, మష్కో సెక్టార్లలో కూడా చొరబాట్లు గుర్తించారు. వెంటనే భారత ఆర్మీ రంగంలోకి దిగింది. కార్గిల్ వైపు సేనలను తరలించింది. దీనికి ఆపరేషన్ విజయ్ అని మన సైన్యం నామకరణం చేసింది. సైన్యానికి తోడుగా వాయుసేన కూడా దాడులు మొదలుపెట్టింది. అయితే, పాకిస్థాన్ రెండు యుద్ధ విమానాలను కూల్చివేసింది. దీంతో మన వాయుసేన మరింతగా విరుచుకుపడింది. మరోవైపు ఆ చొరబాట్లతో తమకు సంబంధం లేదంటూ పాక్ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ అందులో పాక్ సైనిక ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను సాక్ష్యాలతో సహా భారత్ ప్రపంచం ముందు ఉంచింది.

దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఫోన్ చేసి వెంటనే కార్గిల్ నుంచి వైదొలగాలని సూచించారు. అనంతరం మన సైన్యం కార్గిల్ సెక్టార్ లో బెబ్బులిగా రెచ్చిపోయి ముష్కర మూకలపై విరుచుకుపడింది. పాక్ ఆక్రమించుకున్న ఒక్కో సెక్టార్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటూ పాక్ సైన్యాన్ని తరిమి కొట్టింది. 1999 జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతం అయిందని అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రకటించారు. జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసిందని మన సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. కార్గిల్ లో భారత విజయానికి గుర్తుగా ప్రతిఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...