Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: 2020లో పెద్ద సినిమాల రిలీజులుంటాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఈ నెలలో సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. వచ్చే నెలలో పరిస్థితులు ఎలా వుంటాయో ఇప్పుడే చెప్పలేం. కానీ, జూన్‌ 8వ తేదీ నుంచి హోటళ్ళు, రెస్టారెంట్లతోపాటు, పర్యాటక ప్రాంతాలు తెరుచుకుంటాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో పర్యాటకానికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు తమ పరిధిలో వున్న విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే, సినిమా థియేటర్ల విషయంలో మాత్రం సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. ఎలా చూసినా, ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరవడం అంత క్షేమం కాదన్నది మెజార్టీ అభిప్రాయం.

అయితే, ఎక్కువ కాలం సినిమా థియేటర్ల మూసివేత కొనసాగితే, సినిమా పరిశ్రమ దారుణంగా నష్టపోతుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఆయా సినీ పరిశ్రమలకు సంబంధించిన పెద్దలు తమ సమస్యల్ని ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నారు. మార్చి మూడో వారం నుంచి మూగబోయిన థియేటర్లు.. ఇంకెన్నాళ్ళు మూసివేయబడి వుంటాయన్నది ఇప్పుడే చెప్పలేం.

కానీ, పెద్ద సినిమాలైతే ఇప్పట్లో విడుదలయ్యే అవకాశమే లేదంటున్నారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ఇదే మాట. చిన్న సినిమాలు మాత్రం.. విడుదలయ్యే అవకాశాలున్నాయట.. అదీ థియేటర్లు తెరుచుకున్న కొంత కాలం తర్వాత మాత్రమే. గతంలోనే విడుదలైన కొన్ని సినిమాల్ని మళ్ళీ రిలీజ్‌ చేసి.. థియేటర్లను కొన్నాళ్ళు రన్‌ చేస్తే.. క్రౌడ్‌ తక్కువగా వుంటుంది కాబట్టి, పరిస్థితిని అంచనా వేయడానికి వీలవుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

‘ఎలాగూ కరోనాతో సహజీవనం చేయక తప్పదని ప్రభుత్వాలు చెబుతున్నాయి.. ఆ సహజీవనానికి థియేటర్లు ఎందుకు అడ్డంకిగా మారతాయి.?’ అన్న ప్రశ్న సగటు సినీ అభిమాని నుంచి వస్తుండడం గమనార్హమిక్కడ. అంతే మరి, దేవాలయాలు తెరుచుకోగా లేనిది.. పర్యాటక ప్రాంతాలు తెరుచుకోగా లేనిది.. కిక్కిరిసిపోయే ప్రజా రవాణా షురూ అవగా లేనిది.. సినిమా మాత్రం ఎందుకు మూసివేసి వుండాలట.!

కాగా, సినిమాని జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తూ, దాన్నొక ప్రాధాన్యత లేని రంగంగా భావిస్తూ వుండడం వల్లే ఈ తరహా చులకన భావం చాలామందిలో వుండడమే ఈ దుస్థితికి కారణమని సినీ ప్రముఖులు వాపోతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...