Switch to English

ఈసీ గుండెల్లో ‘185’ దడ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడినప్పటినుంచీ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం నిజామాబాద్‌. సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవితకు గెలుపు ప్రెస్టీజ్‌ ఇష్యూగా మారిన ఇందూరు గడ్డపై పోటీ రసవత్తరంగా మారింది. పసుపుతోపాటు ఎర్రజోన్నల రైతులు రెండు నెలలుగా మద్దతుధరకోసం నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

పైపెచ్చు. ఆర్మూర్‌ నుంచి నిజామాబాద్‌కు భారీ ర్యాలీగా బయలుదేరిన రైతులపై అమానుషంగా లాఠీచార్జ్‌ చేసిన ఘటన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. పరిస్థితి గరం గరంగా ఉన్న సమయంలో ఎన్నికలు రావడంతో.. తమ ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు.

షెడ్యూల్‌ విడుదలకు ముందునుంచే.. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. రైతు సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత వీరిని బుజ్జగించేందుకు కవిత, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండాపోయింది. దీని ప్రతిఫలమే.. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత 185మంది బరిలో దిగడం.

రైతుల నామినేషన్లు నిజామబాద్‌లో రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌-బీజేపీ-కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని.. కవితకే మరోసారి అవకాశం ఉంటుందనే పరిస్థితి నుంచి మెల్లగా మార్పుమొదలైంది. హెచ్చరించిన రైతులు వెనక్కు తగ్గుతారనుకున్నా అలా జరగలేదు. ఇంతింతై.. వటుడింతై అన్నట్లు రోజు రోజుకూ పదుల సంఖ్యలో నామినేషన్లు పడ్డాయి.

చివరిరోజు వచ్చేసరికి ఇవన్నీ కలిసి 245కు చేరాయి. ఈ నామినేషన్ల ‘నాన్సెన్స్‌’ వెనక బీజేపీ, కాంగ్రెస్‌ ఉన్నాయని కవిత ఆరోపించారు. మోదీపైనా వారణాసిలో ఇలాగే నామినేషన్లు వేయిస్తామని శపథం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతే రైతులతో నామినేషన్లు వేయించిందని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌ ఏమీ మాట్లాడటం లేదు. వీరిమధ్య గొడవ సంగతి కాసేపు పక్కనపెడతాం. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఈ నామినేషన్లు, అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యూహాత్మక ఎత్తులు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారాయి.

185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం ఖాయం కావడంతో ఎలా ఎన్నిక నిర్వహించాలనేది తలనొప్పిగా మారింది. ఇంతమంది కోసం ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించలేమని చేతులెత్తేసింది. మరేం చేయాలి? బ్యాలెట్‌తో ఎలక్షన్లు నిర్వహించడం ఒక్కటే మార్గం. సరే బ్యాలెట్‌తోనే నిర్వహిద్దాం. 185 పేర్లు ఒక పేపర్లో ఉండాలంటే ఎలా చేయాలి? గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తాయా? అప్పుడేం చేశారు? ఇప్పుడేం చేయాలి? ఇలా చిత్రవిచిత్రమైన ప్రశ్నలతో ఈసీ తలపట్టుకుంది.

రైతులు బెదిరిస్తున్నారు కాబట్టి.. చివరి వరకు చాలా మంది బరినుంచి తప్పుకుంటారని ఈసీ అనుకుంది. కానీ ఈ అనూహ్య పరిస్థితితో నోట్లోంచి మాటలు రాక.. కేంద్ర ఎన్నికల సంఘానికి పరిస్థితిని వెల్లడించింది. సీఈసీ కూడా దీనిపై చర్చలు జరిపి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

లేదంటే.. నిజామాబాద్‌ ఎన్నికను వాయిదా వేసి.. కొంచెం టైమ్‌ తీసుకుని ఎన్నిక నిర్వహించే అవకాశమూ లేకపోలేదు. బ్యాలెట్‌ పేపర్‌తోపాటు బ్యాలెట్‌ బాక్సులను కూడా అదే స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిషన్‌ 185ను సమస్యల్లేకుండా పాస్‌ కావడం ఈసీకి కత్తిమీద సామే. చూద్దాం.. ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో..!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...