వరుసకు అన్నయ్య అయినా.. తోడబుట్టిన వాడైనా ‘అన్నయ్య’ అంటే ఓ భరోసా. కానీ.. ఇవేమీ ఆ కామాంధుడికి పట్టలేదు. తాను చేయాలనుకున్న అఘాయిత్యానికి ఈ బంధుత్వం, వావి వరుసలేమీ అడ్డుకాలేదు. దూరపు బంధువు తనకు చెల్లెలు అవుతుందని తెలిసినా.. ఓ బాలిక అని చూడకుండా అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యంత దారుణమైన ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది 11 ఏళ్ల బాలిక. అదే గ్రామానికి దూరపు బంధువైన 23 ఏళ్ల చిలకా షడ్రక్ ఆ బాలికపై కన్నేశాడు. శుక్రవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన షడ్రక్ ఆమె ఇంటికి వెళ్లాడు. బాలికతో ఆటలాడుతూ మాయమాటల్లోకి దింపాడు. ఆ తర్వాత బాత్రూమ్ కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కామాంధుడి కామ దాహానికి బలైపోయిన బాలిక నిస్సత్తువగా ఉండిపోయింది. పొలం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వెంటనే అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
753641 699775But wanna say that this really is extremely helpful , Thanks for taking your time to write this. 229968
365607 579161You should be a part of a contest initial of the most effective blogs online. Let me suggest this weblog! 48760
749530 372585This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for typically trying to drop the weight as nicely within the have a significantly healthier lifetime. shed weight 221995
845014 698771Yeah bookmaking this wasnt a bad conclusion wonderful post! . 490810