Switch to English

టీడీపీ అనుకూల మీడియాపై వైసీపీ కక్ష సాధింపు చర్యలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే కథనాలపై చర్యల దిశగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొన్నాళ్ళ క్రితమే ఓ ‘ప్రత్యేక జీవో’ తెచ్చిన విషయం విదితమే. ‘అది పాత జీవోనే..’ అంటూ వైసీపీ చెప్పుకుంటున్నా, ఆయా శాఖలపై వచ్చే దురుద్దేశపూరిత తప్పుడు కథనాలపై చర్యలు తీసుకునేలా ఆయా శాఖల ఉన్నతాధికారులకు అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై ప్రధానంగా టీడీపీ అనుకూల మీడియా నానా యాగీ చేసింది.

‘చంద్రబాబు హయాంలో వైసీపీ అనుకూల మీడియా తప్పుడు కథనాలు రాయలేదా.?’ అన్నది టీడీపీ అనుకూల మీడియా వాదన. ఈ టీడీపీ అనుకూల మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తదితర సంస్థలున్నాయి. గతంలో టీవీ9 మీద కూడా టీడీపీ అనుకూల మీడియా అనే ముద్ర వున్నా, ఆ సంస్థ నుంచి రవిప్రకాష్‌ ‘ఔట్‌’ అయిపోయాక, ఆంధ్రప్రదేశ్‌లో అది వైసీపీ అనుకూల మీడియా సంస్థగా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అనుకూల మీడియా సంస్థగా మారిపోయిందంటారు రాజకీయ విశ్లేషకులు.

గత కొద్ది రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. టీవీ5 మూర్తిపై కేసు నమోదవడం, ఆ కేసుపై ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసి గగ్గోలు పెట్టడం తెల్సిన విషయమే. తాజాగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు ప్రభుత్వం తరఫున శ్రీముఖాలు అందాయి. ‘తప్పుడు కథనాలు’ రాశారంటూ రెండు శాఖల తరఫున ఈ శ్రీముఖాలు వెళ్ళాయి ఈ రెండు సంస్థలకీ.

నిజానికి, మీడియాలో ఈ తరహా కథనాలు కొత్తేమీ కాదు. చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే. స్టింగ్‌ ఆపరేషన్‌ అనండి.. ఇంకో పేరు పెట్టండి.. ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపడం అనే కోణంలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కొత్త పుంతలు తొక్కింది. ఎప్పుడైతే దానికి ‘రాజకీయ రంగు’ అంటుకోవడం షురూ అయ్యిందో.. తప్పు కూడా ఒప్పుగానూ, ఒప్పు కూడా తప్పుగానూ కన్పిస్తోంది. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.

నిజానికి, గతంలో మీడియా అంతా ఒక్కటిగా వుండేది.. అప్పట్లో మీడియాకి నైతిక విలువలనేవి వుండేవి. ఎవరన్నా జర్నలిస్ట్‌ మీద ప్రభుత్వం తరఫున కేసులు నమోదైనాసరే, ‘కక్ష సాధింపు చర్యలు’ అంటూ మొత్తంగా మీడియా ఏకమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘నీ చావు నువ్వు చావాల్సిందే..’ అని మిగతా మీడియా సంస్థలే కాదు, జర్నలిస్టు సంఘాలు కూడా లైట్‌ తీసుకుంటున్నాయి. సో, ఈనాడు – ఆంధ్రజ్యోతిలపై ప్రభుత్వం ఏ చర్యకు దిగినా.. అది టీడీపీని ‘గిల్లినట్లు’ వుంటుంది తప్ప, మొత్తం మీడియాపైన ప్రభుత్వ దాడి.. అనడానికి వీల్లేని పరిస్థితి. చట్టపరమైన చర్యల దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఆ రెండు మీడియా సంస్థలు ఏం చేస్తాయో వేచి చూడాల్సిందే.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...