Switch to English

అర్జంటుగా ‘బీజేపీ – జనసేన’ మధ్య చిచ్చుపెట్టెయ్యాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

బీజేపీవైసీపీ బంధం మీద అధికార వైసీపీ అడ్డగోలు ఆరోపణలు చేస్తోంది. ‘పాచిపోయిన లడ్డూలు కమ్మగా వున్నాయా.?’ అంటూ జనసేన అధినేతను వైసీపీ మంత్రులు ప్రశ్నించేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించేముందు, ‘కేంద్రంతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి..’ అని పదే పదే చెప్పుకుంటున్న వైసీపీ అధినాయకత్వం, ఢిల్లీ నుంచి ఎలాంటి లడ్డూల్ని అందుకుందో మాత్రం చెప్పలేకపోతున్నారు.

ఏ లడ్డూ దెబ్బలకి వైసీపీ పెద్దల నోళ్ళు ప్రత్యేక హోదా విషయంలో మూతబడ్డాయో చెప్పడం వైసీపీకి సాధ్యమయ్యే పని కాదు. టీడీపీ పరిస్థితీ అంతే. ఇక, తెలుగుదేశం పార్టీ తంతు ఇంకోలా వుంది. నేరుగా జనసేన – బీజేపీలను విమర్శించే పరిస్థితుల్లో లేదు టీడీపీ. అందుకే, టీడీపీ తన అను‘కుల’ మీడియాని రంగంలోకి దించింది.

‘జనసేన – బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాదట..’ అంటూ ప్రచారం షురూ అయ్యింది టీడీపీ అను‘కుల’ మీడియాలో. పవన్ కళ్యాణ్ కాకపోతే ఇంకెవరు.? ఆ ప్రశ్నకు టీడీపీ, ఆ పార్టీ అను‘కుల’ మీడియా.. అదే సమయంలో వైసీపీ, వైసీపీ అను‘కుల’ మీడియా సమాధానం చెబితే బావుంటుందేమో.

బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి పెద్ద విషయం కాదు. బీజేపీతో రాసుకుపూసుకు తిరిగితే వచ్చే లాభమేంటన్నదానిపై జనసేన అధినేతకు ఓ ఖచ్చితమైన అంచనా వుండే వుంటుంది. బీజేపీతో ఉపయోగం లేదన్న అంచనాకి వస్తే, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడంజనసేన కి చిటికె వేసినంత పని.

బీజేపీ విషయానికొస్తే, ఏపీలో బలపడాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్‌ని ముందు పెట్టి రాజకీయం చేస్తోంది. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించేసింది. జాతీయ స్థాయి నేతలూ ఈ విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు. పవన్ కాకపోతే ఇంకెవరు.? అన్న ప్రశ్నకు బీజేపీ వద్ద సమాధానం లేనప్పుడు, పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ రిస్క్ తీసుకునే అవకాశమే లేదు కదా.!

ఇవన్నీ టీడీపీ, వైసీపీ.. ఆయా పార్టీల అనుకూల మీడియా సంస్థలకి తెలియనివేమీ కావు. కానీ, అర్జంటుగా బీజేపీ – జనసేన మధ్య చిచ్చపెట్టెయ్యాలన్న కక్కుర్తితో ఏవేవో చెత్త ప్రచారాలు తెరపైకి తెస్తున్నారంతే.

3 COMMENTS

  1. 981598 61237Youre so cool! I dont suppose Ive read anything in this way before. So good to uncover somebody with some original suggestions on this subject. realy appreciate starting this up. this excellent website is something that is necessary more than the internet, a person if we do originality. valuable work for bringing something new towards the internet! 28571

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...