Switch to English

‘గ్రాఫిక్స్ 2.0’: చంద్రబాబుకి ఊపిరి పోస్తున్న వైఎస్ జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘రాష్ట్రంలో అధికారంలో వుంటే వైసీపీ వుండాలి, లేదంటే టీడీపీ వుండాలి..’ అన్నది వైసీపీ రాజకీయ ఎజెండాలా కనిపిస్తోంది. ‘వుంటే టీడీపీ అధికారంలో వుండాలి, లేదంటే వైసీపీ వున్నా ఫర్లేదు..’ అన్నది టీడీపీ ఉద్దేశ్యం. మూడో రాజకీయ శక్తి అనేది రాష్ట్రంలో వుండకూడదన్న కోణంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయి.

అమరావతిలో చంద్రబాబు హయాంలో నిర్మితమైన భవనాల్ని ఉద్దేశించి ‘గ్రాఫిక్స్’ అంటూ వస్తోంది వైసీపీ. అధికారంలోకి వచ్చాక కూడా అధికారికంగా ‘గ్రాఫిక్స్’ ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు మాత్రం, ఆ గ్రాఫిక్స్ ఆరోపణలు కాస్త పక్కన పెట్టి, 3 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో కొన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని అనుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట.

‘చంద్రబాబు మొదలు పెట్టిన గ్రాఫిక్స్‌ని వైఎస్ జగన్ పూర్తి చేయబోతున్నారన్నమాట.. ఇందుకోసం 3 వేల కోట్లు ఖర్చు చేస్తారన్నమాట..’ అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు హయాంలో అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. హైకోర్టు నిర్మాణం కూడా జరిగింది. అయితే, వాటన్నిటికీ చంద్రబాబు ‘తాత్కాలికం’ అని పేరు పెట్టారు. నిజానికి ఆ భవనాలు శాశ్వతమైనవే, వాటిల్లో కార్యకలాపాలు ‘తాత్కాలికం’ అన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. చంద్రబాబు ఉద్దేశ్యం ఏదైనా, అదంతా ఇంకోలా ప్రొజెక్ట్ అయ్యింది వైసీపీ పుణ్యమా అని.

ఇక, చంద్రబాబు నానా రకాల పబ్లసిటీ స్టంట్లూ చేసి కొన్ని అధికారిక నిర్మాణాల్ని ఎలాగైతేనేం ప్రారంభించారు. కానీ, అవి పూర్తవలేదు. కొన్ని 70 శాతం పైన, కొన్ని 90 శాతం పైన కూడా పూర్తయ్యాయి. అయితే, అవన్నీ గ్రాఫిక్స్.. అని వైసీపీ గతంలో ఆరోపించింది. ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ ముందడుగు వేసింది. అమరావతి ప్రాంత అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలూ తీసుకోబోతున్నారు. ఈ పనేదో గత రెండేళ్ళలో చేసి వుంటే, రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఓ వెలుగు వెలిగేదే. రాష్ట్రానికి అమరావతి ద్వారా ఎంతో కొంత ఆదాయం కూడా వచ్చి వుండేదే.

చంద్రబాబు మీద కక్షగట్టి అమరావతిని ఆపేసిన జగన్ సర్కార్, ఎలాగైతేనేం.. ఇప్పుడు తప్పు సరిదిద్దుకుని అమరావతి విషయంలో ముందడుగు వేయడాన్ని అభినందించాల్సిందే. అయితే, గ్రాఫిక్స్ 2.0 ఆలోచనలు చేస్తే మాత్రం చంద్రబాబు కంటే దారుణ పరాభవం రాజకీయంగా వైసీపీకి తప్పదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...