Switch to English

వూహాన్ వాటర్ పార్కులో జోరుగా హుషారుగా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అది ఓ వాటర్ పార్క్. వేలాదిగా స్విమ్ సూట్లలో జనాలు కేరింతలు కొడుతున్నారు. భారీ స్పీకర్ల నుంచి వచ్చే సంగీతం.. దానికి అనుగుణంగా జనాల డ్యాన్సులు.. ఎటు చూసినా కోలాహలం.. మాస్కుల మాటే లేదు. సోషల్ డిస్టెన్స్ అన్నది లేనే లేదు.. ఇదంతా కరోనా కల్లోలానకి ముందు అయి ఉంటుంది అనుకుంటే మాత్రం క్వారంటైన్ లో కాలు పెట్టినట్టే. ఇదంతా జరుగుతోంది ఇప్పుడే. ఎక్కడో తెలుసా? కరోనా మహమ్మారి పుట్టిన చైనాలోని వూహాన్ లో.

ప్రపంచం మొత్తం కరోనాతో కకావికలమవుతుంటే.. ఆ రాకాసి వైరస్ ను ప్రపంచానికి పాకేలా చేసిన చైనాలో మాత్రం జనాలు జోరుగా చిందులేస్తున్నారు. చైనాలో 76 రోజుల కఠినమైన లాక్ డౌన్ ను ఏప్రిల్ లో ఎత్తివేయగా.. అప్పటికే అక్కడ కేసులు తగ్గుముఖంగా పట్టాయి. మే వరకు అడపాదడపా కేసులు నమోదైనా.. మే నెల మధ్య నుంచి ఒక్క కేసు కూడా రాలేదు.

ఈ నేపథ్యంలో క్రమంగా అన్ని ఆంక్షలూ ఎత్తివేశారు. ఇందులో భాగంగా వాటర్ పార్కులు కూడా తెరిచేశారు. సందర్శకులను ఆకర్షించడం కోసం భారీగా రాయితీలు ప్రకటించారు. దీంతో వారంతాపు రోజుల్లో వాటర్ పార్కులకు జనాలు పోటెత్తుతున్నారు. కరోనా వైరస్ పుట్టినల్లు అయిన వూహాన్ లోని మాయా వాటర్ పార్కు మొన్న శని, ఆదివారాల్లో అయితే.. ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ఎవరికీ మాస్కులు లేకపోవడం.. భౌతిక దూరం అనేది భూతద్దంలో పెటిట చూసినా కానరాకపోవడం చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొట్టడం.. వెబ్ సైట్లలో వార్తలు రావడంతో.. అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు.

అసలు కరోనా అంటే ఏమిటో తమకు తెలియదు అనేంతగా వూహాన్ జనం సంబరాల్లో మునిగిపోయారు. అయితే, దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నంత మాత్రాన ప్రమాదం లేకుండా పోలేదని.. చిన్న తప్పిదం చేసినా మరోసారి ఆ మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని చైనా అధికార వర్గాలు తేలిగ్గా తోసిపుచ్చుతున్నాయి. తమ ప్రావిన్సులో మే నుంచి కేసులు నమోదు కాకపోవడంతోనే వాటర్ పార్కులకు అనుమతి ఇచ్చామని చెబుతున్నాయి.

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల మంది కరోనా బారిన పడగా.. ప్రతిరోజూ దాదాపు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఒక్క భారత్ లోనే రోజుకు 50వేలకు పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. కానీ ప్రపంచానికి ఈ వైరస్ పరిచయం చేసిన చైనాలో మాత్రం 85వేలకు మించి కేసులు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు, ప్రజలు పార్టీ మూడ్ లోకి దిగిపోయి కేరింతలు కొడుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...