Switch to English

ఏపీకి ‘వరద విరాళాలు’ టాలీవుడ్‌ నుంచి రావా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎప్పుడూ ఎవరో ఒకర్ని విమర్శించడం తప్ప కొందరికి వేరే పని వుండదు. సోషల్‌ మీడియా వేదికగా ఇలాంటి పనిలేని బ్యాచ్‌కి కావాల్సినంత ‘మషాలా’ ఎప్పుడూ దొరకుతూనే వుంటుంది. తెలుగు సినీ ప్రముఖులు కష్ట కాలంలో స్పందించడంలేదంటూ ‘హైద్రాబాద్‌ వరదల’ నేపథ్యంలో నిందలు వేసేశారు. కొందరైతే, పలువురు సినీ ప్రముఖులపై జగుప్సాకరమైన భాష కూడా వాడేశారు. కానీ, మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు పెద్దయెత్తున విరాళాల్ని ప్రకటించారు.. ఇంకా ప్రకటిస్తూనే వున్నారు. ‘సామాజిక బాధ్యతను’ చాటుకున్నారు.

సినీ పరిశ్రమ నుంచి విరాళాల వెల్లువ ఇదే కొత్త కాదు. గతంలోనూ వున్నదే. ఎప్పుడూ సినీ పరిశ్రమ ఈ విషయంలో వెనుకంజ వేసింది లేదు. కరోనా కారణంగా పరిశ్రమ నష్టపోయినా.. సినీ ప్రముఖులు విరాళాల విషయంలో పెద్దమనసు చాటుకుంటూనే వున్నారు. ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొందరు ‘పనిలేని బ్యాచ్‌’కి చెందిన నెటిజన్లు, ‘తెలంగాణకు మాత్రమేనా.? ఆంధ్రప్రదేశ్‌కి విరాళాలు ఇవ్వరా.?’ అంటూ కొత్త రచ్చ మొదలు పెట్టారు.

నిజమే, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా వరద నష్టాల్ని చవిచూస్తున్న మాట వాస్తవం. తెలంగాణకు ఇచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వకుండా వుండరు సినీ ప్రముఖులు. ఇస్తారు, కానీ.. ఆ ‘స్పేస్‌’ సినీ ప్రముఖులకి కాస్తయినా ఇవ్వాలి కదా.!

కొన్నాళ్ళ క్రితం విజయ్‌ దేవరకొండ ఇలాంటి విమర్శలపైనే ఘాటుగా స్పందించాడు. రాజమౌళి కూడా అసహనం వ్యక్తం చేశాడు. ‘మేం ఎప్పుడివ్వాలి.? ఎంత ఇవ్వాలి.? ఎలా ఇవ్వాలి.? అన్నది మా ఇష్టం. దయచేసి మాకు ఆ స్పేస్‌ ఇవ్వండి..’ అని చాలామంది సినీ ప్రముఖులు చెప్పుకున్నారు. కానీ, ‘పనిలేని బ్యాచ్‌’ నెటిజన్లు ఆగుతారా.? ససేమిరా ఆగరు.

పోనీ, ఇలా సినీ పరిశ్రమ మీద బురదజల్లే బ్యాచ్‌ ఏమన్నా తమవంతు సామాజిక బాధ్యతగా కనీసం పది, పాతిక రూపాయలన్నా విరాళం ఇస్తారా.? అంటే అదీ లేదు. అన్నట్టు, ఈ తరహా విమర్శల వెనుక రాజకీయ కోణం కూడా వుంటుంది. దురదృష్టమేంటంటే, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు మాత్రమే విరాళాలు ఇస్తారు.. ఎన్నికల్లో గెలుపు కోసం కోట్లాది రూపాయలు వెదజల్లే రాజకీయ నాయకులు.. కష్ట కాలంలో విరాళాల ఇవ్వడం చాలా చాలా ఆరుదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...