మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. భారీ వ్యయంతో వేసిన టెంపుల్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఇక ఆచార్య రిలీజ్ డేట్ కు సంబంధించి తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. మే 9న ఆచార్య విడుదల కావొచ్చని అంటున్నారు. మే 9 అనేది చిరంజీవికు చాలా లక్కీ డేట్. అదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ కూడా అదే రోజున విడుదలైంది. ఈ రెండు సినిమాలు చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.
మరి ఈ నేపథ్యంలో ఆ లక్కీ డేట్ కే ఆచార్యను కూడా విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నారట. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఆచార్యలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
192243 702161you might have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 394925
657011 537173I besides believe therefore , perfectly composed post! . 394179