Switch to English

‘భోళా శంకర్’ దుష్ప్రచారం.! పెయిడ్ ఆర్టికల్స్‌కి చెల్లింపులు చేస్తున్నదెవరో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

సాధారణంగా అధికారంలో వున్నోళ్ళు, మీడియాకి ప్రకటనలు ఇస్తుంటారు. ప్రభుత్వ పరంగా వచ్చే ప్రకటనలవి. ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ చేసుకోవడం కోసమే అధికారం.! ఎవరు అధికారంలో వున్నా, అది కామన్ అయిపోయింది.

విపక్షంలో వున్నా, మీడియాకి డబ్బులిచ్చి ప్రకటనలు వేయించుకోవడం, అనుకూల వార్తలు రాయించుకోవడం.. ఇది ఇంకో ట్రెండ్.! రాజకీయాల్లానే, సినిమాల పబ్లిసిటీ కోసం కూడా అనుకూల వార్తలు రాయించుకోవడం కొత్తేమీ కాదు.

కాకపోతే, కొత్త ట్రెండ్ షురూ అయ్యింది. దుష్ప్రచారం కోసం చెల్లింపులు జరుగుతున్నాయ్. అది కూడా, ‘భోళా శంకర్’ సినిమాతోనే మొదలైంది. ‘బ్రో’ సినిమా కోసం ఈ ‘పెయిడ్ ఆర్టికల్స్’ ట్రెండ్‌ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ మాటకొస్తే, అంతకు ముందు ‘ఆచార్య’ సినిమాకీ ఇదే పద్ధతిని ఫాలో అయ్యారనుకోండి.. అది వేరే సంగతి.

‘భోళా శంకర్’ సినిమా మీద దుష్ప్రచారం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలకు గట్టిగానే చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఆయా మీడియా సంస్థలకు వేరుగా, రాసే రాతగాళ్ళకూ వేరుగా ఈ చెల్లింపులు జరిగాయట.

దీనికి తోడు, అదనంగా ‘పీఆర్ బృందాలకీ’ చెల్లింపులు జరిగాయంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు పీఆర్ బృందాలు, సోషల్ మీడియాలో వెయ్యికి పైగా ఫాలోవర్స్ వున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌కి చెల్లింపులు చేసి, ‘భోళా శంకర్’ మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేశాయి.

రాజకీయాల్లో పేటీఎం కార్మికులు, ఫోన్ కార్మికుల్ని చూస్తున్నాం కదా.! ఇక్కడ కూడా అదే బాపతు నడుస్తోంది. ఒక్కో ట్వీటుకీ, గరిష్టంగా పది రూపాయల నుంచి పాతిక రూపాయల వరకూ చెల్లిస్తున్నారట. ఏంటీ, ఇదంతా చిరంజీవి మీద విషం చిమ్మడానికేనా.? అంటే, ఔననే సమాధానం వస్తోంది.

ఓ నాలుగైదు వెబ్ సైట్లు, కేవలం ‘భోళా శంకర్’ సినిమా మీద నెగెటివిటీతోనే లక్షల్లో ఆర్జించాయని అంటున్నారు. గాలి వార్తలు పోగేసే ఓ ప్రముఖ వెబ్‌సైట్, దాంతోపాటుగా మరో రెండు పాపులర్ వెబ్‌సైట్లు ఈ మొత్తం కుట్రలో కీలక పాత్ర పోషించాయిట.

చిత్రమేంటంటే, పొద్దున్న లేస్తే.. పరస్పరం బూతులు తిట్టుకునే రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాలు.. ఒక్కటైపోయి మరీ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ మీద దుష్ప్రచారం చేయడం.
ఇంతా చేసి ఏం సాధిస్తారు.? అంటే, అదో పైశాచికానందం.. శునకానందం అంతే.! రేపో మాపో చిరంజీవి కొత్త సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. చిరంజీవి రెమ్యునరేషన్ దగ్గర్నుంచి, ఆ సినిమాకి సంబంధించిన ప్రతి వార్తా ఓ సంచలనమే అవుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎలాగూ వేరే లెవల్‌లోనే జరుగుతుందనుకోండి.. అది వేరే సంగతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...