Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: పోలీసుల్ని వైసీపీ నేతలు కొట్టారా.? కాపాడారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విశాఖలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా పెను దుమారానికి కారణమయ్యింది. వైసీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనా కార్యక్రమంలో ఓ పోలీసు అధికారి కిందపడిపోయారు. వైసీపీ నేతలు చెబుతున్నదాన్నిబట్టి చూస్తే సదరు పోలీస్‌ అధికారి, తనంతట తానుగానే తన కాలిని తానే తన్నేసుకుని కిందపడిపోయారు. బాధిత పోలీసు అధికారి చెబుతున్నదాన్నిబట్టి, అనుకోకుండా తన పక్కనుంచే వెళుతోన్న ఆటో తనను కాస్త తాకడంతో పడిపోయారట. ‘పోలీస్‌ అధికారితోపాటు మరొకాయన కిందపడిపోతే, నేను పైకి లేవదీసి సాయం చేశాను.. తలకు దెబ్బ తగిలిందేమోనని మసాజ్‌ చేశాను..’ అని ఇంకో వ్యక్తి చెబుతున్నారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందిస్తూ, వైసీపీ గూండాలు ఓ పోలీస్‌ అధికారిపై దాడి చేశారంటూ ట్వీటేశారు. దానికి కౌంటర్‌గా పోలీస్‌ శాఖ, ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ అంటూ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఇంతకీ ఏది నిజం.? బాధిత పోలీస్‌ అధికారి, తన మీద ఎవరూ దాడి చేయలేదంటున్నారు కాబట్టి, అస్సలక్కడ ఎలాంటి గొడవా జరగలేదని మనం అనుకోవాలి. కానీ, ‘పోలీసుల్ని అలా అధికార పార్టీ నేతలు బెదిరించి, తమ దార్లో పెట్టుకున్నారు..’ అని టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని ఎలా అర్థం చేసుకోవాలట.? ఓ తెలుగు సినిమాలో హీరో ఓ డైలాగ్‌ చెబుతాడు. అక్కడ జరిగిందొకటి.. బాధితుడిది ఒక వెర్షన్‌.. బాధ్యుడిది ఇంకో వెర్షన్‌.. చూసేవాడిది మరో వెర్షన్‌.. చేప్పేవాడిది ఇంకో వెర్షన్‌.. అసలు వాస్తవం వేరు.. నిజం వేరు.. అని. ఇది జస్ట్‌ సినిమా డైలాగ్‌ మాత్రమే అనుకోగలమా.?

పోలీస్‌ అధికారి తనంతట తాను కింద పడిపోవడమేంటి.? విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా వుండే ఓ పోలీస్‌ అధికారి.. అట్నుంచి అటో వెళుతోంటే, అంత నిర్లక్ష్యంగా వుంటారా.? పైగా, సదరు పోలీస్‌ అధికారిని ‘వెనక నుంచి ఓ వ్యక్తి బలంగా పట్టుకుని’ కనిపిస్తున్నాడు. ఏదో జరిగింది.. అదేంటో మాత్రం ఎవరికీ తెలియదు. ‘అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికీ వెనుకాడం..’ అంటున్నారు పోలీస్‌ ఉన్నతాధికారులు. నిజమేంటన్నది పైవాడికే ఎరుక. ఒక్కటి మాత్రం నిజం.. ఇక్కడ చంద్రబాబు పూర్తిస్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించారు సోషల్‌ మీడియా వేదికగా. అసలక్కడ బాధిత పోలీస్‌కి సమస్య లేనప్పుడు, చంద్రబాబుకెందుకు అంత అత్యుత్సాహం.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....