తెలుగు రాష్ట్రాలకు ఈసారి వర్షాల ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ఏపీలో ఊళ్లు, పొలాలు నీట మునిగితే.. తెలంగాణలో ఈ పరిస్థితితోపాటు హైదరాబాద్ నగరం బాగా ఎఫెక్ట్ అయింది. 2016లో చెన్నై వరదలను తలపిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాలు, శివారు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. వీధుల్లో చేరిన వరద నీటిలో బోట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నో అపార్ట్ మెంట్లలోని సెల్లార్లు, సొంత ఇళ్లలోకి నీళ్లు చేరిపోయాయి. ప్రస్తుత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
- అపార్ట్ మెంట్స్ సెల్లార్లలోకి నీరు ఎక్కువగా చేరుకోవడంతో నిల్వ ఉండిపోవడం మంచిది కాదు. మోటార్లతో నీటిని తోడేయాలి. కొద్ది రోజులకైతే ఇబ్బంది కాకపోయినా ఎక్కువ రోజులు ఉంటే నిర్మాణాలకు ఇబ్బంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా నీటిని మోటార్లతో తోడెయ్యాలి.
- సెల్లార్లో గంతలు, నీరు బయటకు వెళ్లే మార్గాల్లో వ్యర్ధాలు లేకుండా చూసుకుంటే నీరు త్వరగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.
- సెల్లార్లలో ఎర్తింగ్ సరిచేయడం మంచిది. లేకపోతే నీటిని తోడే క్రమంలో కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
- సెల్లార్లలో గోడల నిర్మాణం కాంక్రీట్ తో కాకుండా ఇటుక, మట్టితో చేపడితే ప్రమాదం. అందుకే అటువంటి ప్రదేశాల్లో నీటి నిల్వ ఉండకూడదు.
- కాలువలు, చెరువుల పక్కన ఉండే ఇళ్ల నిర్మాణాల్లో నివాసాలకు ఈ సమయంలో ప్రమాదం ఎక్కువ. వాటి పునాదులపై స్ట్రక్చరల్ ఇంజనీర్ తో పరిశీలన పూర్తి చేసాకే వాటిలో నివాసం ఉండటం మంచిది.
- గోడలు నీటిలో ఎక్కువగా నానకూడదు. ఫంగస్ వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
697088 832187Great post, I believe website owners ought to acquire a great deal from this internet site its extremely user pleasant. 426731
571380 269588Woh I like your posts , saved to fav! . 44759
379277 933241Perfectly composed content , thankyou for entropy. 464262
640898 731863brilliantly insightful post. If only it was as straightforward to implement some of the solutions as it was to read and nod my head at each of your points 960524