Switch to English

ఉక్కుపోరాటం గల్లీలో కాదు, ఢిల్లీలో చేసే దమ్మెవరికుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘గల్లీ’ పోరాటం చేస్తున్నాయి. విశాఖ వేదికగా పోరాటం జరగాల్సిందే.. కానీ, అదే పోరాటాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలి. అప్పుడే, అది రాష్ట్ర స్థాయి పోరాటం అవుతుంది. అక్కడితో ఆగకూడదు, రాష్ట్ర స్థాయి పోరాటాన్ని జాతీయ స్థాయి పోరాటంగా మార్చగలగాలి. నిజానికి, పోరాటం మొదలవ్వాల్సింది ఢిల్లీ వేదికగా. ఎందుకంటే, కేంద్రమే ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది.. అదీ పార్లమెంటు సమావేశాల సమయంలో.

మరి, పార్లమెంటులో బలం వున్న రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఢిల్లీ వీధుల్లో కదా పోరాటం చేయాల్సింది.? ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక జగన్ హస్తం వుంది..’ అంటూ ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. ఈ తరహా చెత్త రాజకీయాలు చేయడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా. అన్నట్టు, టీడీపీ దారిలోనే వైసీపీ కూడా నడుస్తోంది. చంద్రబాబు హయాంలోనే బీజం పడిందంటే, చేతులు దులిపేసుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. గతంలో ఎవరేం చేశారన్నది ఇప్పుడు అనవసరం. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. జెండాలు పక్కన పెట్టి, గల్లీలో పోరాటం కొనసాగిస్తూనే ఢిల్లీలో పోరాటం చేయాలి.

ఢిల్లీలో ప్రస్తుతానికి రాష్ట్రం నుంచి ‘పవర్ సెంటర్’ అనేది ఏదన్నా వుంటే అది విజయసాయిరెడ్డి మాత్రమేనని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. మరి, విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నట్టు?. ఉత్తరాంధ్రకు సంబంధించి వైసీపీ వ్యవహారాలు చక్కబెట్టేది ఈయనగారే. ప్రభుత్వం తరఫున కూడా కీలక నిర్ణయాలు విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతాయి.. విశాఖ వరకూ. మరి, విశాఖ ఉక్కు వ్యవహారంలో విజయసాయిరెడ్డి పెద్దన్న పాత్ర వహించి.. ఉద్యమానికి నాయకత్వం వహించాలి కదా.? కానీ, ఆయన టీడీపీని తిడతారు.. వీలైతే జనసేన మీద సెటైర్లు వేస్తారు.

ట్విట్టర్‌లో చతుర్లు వదలడం ఆయనకు బాగా తెలుసుగానీ.. కేంద్రాన్ని నిలదీసేంత సీన్ ఆయనకు లేదు. ప్రత్యేక హోదా విషయంలో అయినా, రైల్వే జోన్ విషయంలో అయినా, మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి అయినా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా విజయసాయిరెడ్డి ఢిల్లీ వేదికగా ‘పోరాటం’ చేశారా.? గల్లీలో అయితే చేసేస్తారు. విశాఖ కార్పొరేషన్‌కి ఎన్నికలు జరగబోతున్నాయ్ కదా.. పాదయాత్ర చేపట్టబోతున్నారట. అదీ విజయసాయిరెడ్డికి విశాఖ మీదా, ఉత్తరాంధ్ర మీదా, ఆంధ్రపదేశ్ మీదా వున్న ప్రత్యేకమైన శ్రద్ధ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...