విజయశాంతిది పోరాటమా? ఆరాటమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,615FansLike
57,764FollowersFollow

సినీ నటి, కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అప్పుడప్పుడూ రాజకీయ తెరపై కన్పిస్తుంటారు. ఒకప్పుడు బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టి, తెలంగాణ కోసమంటూ తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి, కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి ‘దేవుడిచ్చిన చెల్లి’గా మారిన విషయం విదితమే. అలా ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి నుంచే మెదక్‌ ఎంపీగా విజయం సాధించి.. రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

అయితే, నిలకడలేని మనస్తత్వం కారణంగా, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇమడలేకపోయిన విజయశాంతి, కీలకమైన సమయంలో టీఆర్‌ఎస్‌ని వీడి, కాంగ్రెస్‌లో చేరారు. ఆ నిర్ణయం ఆమె తీసుకోకపోయి వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికీ ఆమె కీలక నేతగా వుండి వుండేవారే. ఏమో, అదృష్టం కలిసొచ్చి విజయశాంతి మంత్రిగానూ అవకాశం దక్కించుకుని వుండేవారేమో. అయినా, ఎవరి దురదృష్టానికి ఎవరు బాధ్యులు.? ఇప్పుడామె రోడ్లపైకెక్కి, టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా నినదించాల్సి వస్తోంది.

‘మీడియా, కేసీఆర్‌ చెప్పు చేతల్లో వుంది. ప్రజల ఆవేదనను మీడియా పట్టించుకోవడంలేదు. ప్రజా ఉద్యమాల్ని కేసీఆర్‌ ప్రభుత్వం అణగదొక్కేస్తోంది. మీడియా సైతం కేసీఆర్‌ బెదిరింపులకు తలొగ్గుతోంది..’ అంటూ విజయశాంతి ఒకింత అక్కసుని మీడియా మీద కూడా వెళ్ళగక్కారు తాజాగా. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాల రచ్చ నేపథ్యంలో విజయశాంతి, కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాంతో, విజయశాంతి చేసిన యాగీ అంతా ఇంతా కాదు.

వాస్తవానికి, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే విజయశాంతి హంగామా ఇంకోసారి కొత్తగా మొదలైంది. అయితే, ఆ ఎన్నికల్లో విజయశాంతిని కాంగ్రెస్‌ నేతలే సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొచ్చి, టిక్కెట్‌ దక్కించుకోగలిగి వుంటే.. పార్టీలో విజయశాంతికి కొద్దో గొప్పో గౌరవం లభించి వుండేది. కానీ, ఆమె అలా చేయలేదు. పోనీ, లోక్‌సభ ఎన్నికల్లో అయినా విజయశాంతి పోటీ చేసేందుకు ప్రయత్నించారా? అంటే అదీ లేదు.

‘నేను పెద్ద స్టార్‌ని’ అనే అహంకారం విజయశాంతిలో ఇంకా పోలేదని ఆమె గురించి చాలా అభిప్రాయాలే వున్నాయి. రాజకీయాల్లోనూ తానొక పెద్ద నేతననే గర్వమే విజయశాంతిని రాజకీయాల్లోనూ ఎదగనీయకుండా చేస్తోందనేవారూ లేకపోలేదు. కొన్ని విషయాల్లో విజయశాంతి వాదనలు సూటిగానే కన్పిస్తాయి. కేసీఆర్‌ని ప్రశ్నించే విషయంలో విజయశాంతి స్పష్టతతోనే వుంటారు. కానీ, పార్టీలో ముఖ్య నేతగా పార్టీ శ్రేణుల్ని కూడదీసి, పార్టీని బలోపేతం చేయడంలో మాత్రం ఆమె విఫలమవుతూ వస్తున్నారు.

విజయశాంతి ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‌గా వుంటారో, ఎప్పుడామె రాజకీయంగా మౌనం దాల్చుతారో ఎవరికీ తెలియదు. పైగా, ‘అలక’ ఆమెకు అతి పెద్ద మైనస్‌ పాయింట్‌. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకపోతే సింపుల్‌గా సైలెంటయిపోతారు.. ఆ అలక వీడటానికి ఆమె ఎక్కువ సమయమే తీసుకుంటారు. రాజకీయమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బోల్డంత స్టార్‌డమ్‌ సంపాదించారు విజయశాంతి సినీ నటిగా.. దాన్ని ఆమె రాజకీయాల్లో సద్వినియోగం చేసుకోవాల్సి వుంది.

ఇదిలా వుంటే, విజయశాంతి సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అదీ మహేష్‌బాబు హీరోగా తెరక్కెనున్న కొత్త సినిమాలో. అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే విజయశాంతి నుంచి ఇంతవరకు సినీ రంగంలోకి రీ-ఎంట్రీ విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు.

14 COMMENTS

సినిమా

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ఏమిటి?

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు సమస్య ఎక్కడో ఉందా? ముందు చాలా సింపుల్...

“నన్ను ఆపలేరు”.. పుకార్లపై శ్యామల ఆరే స్ట్రాంగ్ వార్నింగ్

వైఎస్సార్‌సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను...

Daily Horoscope: సింహకు కొత్త అవకాశాలు.. ధనుస్సుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు

మే 17 , 2026 ఆదివారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం,...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...