Switch to English

హీరో నిఖిల్‌ని తొక్కేస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

యువ కథానాయకుడు నిఖిల్‌ సిద్ధార్ద్‌ చిక్కుల్లో పడ్డాడు. తన కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నిఖిల్‌ని వెంటాడుతోంది. సినిమా పూర్తయిపోయింది. సెన్సార్‌ కూడా అయిపోయింది. మే 1న సినిమా విడుదల కావల్సి ఉండగా, ఇంగ్లీష్‌ సినిమా ‘అవెంజర్స్‌’ పేరు చెప్పి, నిఖిల్‌ సినిమాని వెనక్కి నెట్టేశారు. ‘మహర్షి’ రిలీజైతే కానీ నిఖిల్‌ సినిమాకి లైన్‌ క్లియర్‌ అయ్యేలా కనిపించడం లేదు. అసలేంటీ సమస్య.? నిఖిల్‌కే ఎందుకిలా జరుగుతోంది.? సినిమా రిలీజ్‌ వాయిదా పడడం కొత్తేమీ కాదు. కానీ ఒక్క సినిమాకి వంద అడ్డంకులు.. అంటే కాస్త సీరియస్‌గా ఆలోచించాల్సి విషయమిది.

నిఖిల్‌ – లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమాకి టి.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వం వహించాడు. మొదట ఈ సినిమాకి ‘ముద్ర’ అనే టైటిల్‌ పెట్టారు. అయితే, ఎవరికీ తెలియని ఓ సినిమా ‘ముద్ర’ పేరుతో విడుదలైపోయింది కొన్నాళ్ల క్రితం. జగపతిబాబు నటించిన సినిమా అది. నిఖిల్‌ సినిమా పోస్టర్స్‌తో జగపతిబాబు సినిమాని సేల్‌ చేసుకున్నారు ధియేటర్స్‌ వాళ్లు. దీని వెనక కుట్ర కోణం దాగి ఉందనీ నిఖిల్‌ అభిమానులు ఆందోళన చెందారు. నిఖిల్‌ కూడా తన సినిమాకి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పాడు.

తెర వెనక ఏం జరిగిందో కానీ, ‘ముద్ర’ టైటిల్‌ని మార్చేందుకు నిఖిల్‌ ఒప్పుకోక తప్పలేదు. కొత్త టైటిల్‌ కోసం అభిమానుల్నే అడిగాడు. సోషల్‌ మీడియాలో ఎక్కువ మంది అభిమానులు ‘అర్జున్‌ సురవరం’ అనే టైటిల్‌కి ఓటేశారు. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ‘అర్జున్‌ సురవరం’ అనేక కారణాలతో వాయిదాల పడుతూ వచ్చింది. ఇప్పుడు ‘అవెంజర్స్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా, ఓ స్ట్రెయిట్‌ తెలుగు సినిమా రిలీజ్‌ని అడ్డుకోవడమంటే, తెర వెనక ఓ పెద్ద కథే నడిచి ఉండాలని నిఖిల్‌ అభిమానులు అనుమానిస్తున్నారు.

‘ఒక సంవత్సరం గ్యాప్‌, మంచి సినిమాతో, ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియన్లు చాలా కష్టపడి కార్మిక దినోత్సవం రోజు మీ అందరి కోసం రావాలనుకున్న తరుణంలో ‘అవెంజర్స్‌’ కోసం ఎదురుదెబ్బ’ అంటూ నిఖిల్‌ వ్యక్తం చేసిన బాధలో డెప్త్‌ అందరికీ అర్దమవుతోంది. ‘డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్ణయాన్ని గౌరవిస్తూ, వారిచ్చే గ్రాండ్‌ రిలీజ్‌ డేట్‌ కోసం ఎదురు చూస్తున్నాను..’ అంటూ అభిమానులకు నిఖిల్‌ క్షమాపణలు చెప్పాడు.

కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు. అక్కడి నేటివ్‌ లాంగ్వేజ్‌ సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. కర్ణాటకలో అయితే డబ్బింగ్‌ సినిమాల్ని రిలీజ్‌ చేయనిచ్చే వారు కాదు. కానీ, ఇక్కడ ఓ డబ్బింగ్‌ సినిమా కోసం అదీ ఓ హాలీవుడ్‌ సినిమా కోసం తెలుగు సినిమాకి అవకాశం లేకుండా చేయడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. టైటిల్‌ మార్పు దగ్గర నుండీ, సినిమా రిలీజ్‌ వరకూ ఓ యువ హీరోకి ఇన్ని సమస్యలా.? పైగా ప్రామిసింగ్‌ హీరో అనిపించుకున్న నిఖిల్‌ సిద్దార్ద్‌ పరిస్థితే ఇలా ఉంటే, ఇంకా చిన్న హీరోల మాటేంటీ.? బహుశా ఈ దారుణం నిఖిల్‌కి బంపర్‌ ఆఫర్‌ అనుకోవాలేమో. ఎవరో అతన్ని గట్టిగా టార్గెట్‌ చేసి ఉంటారేమో అనుకోకుండా ఉండగలమా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...