Switch to English

కేసీఆర్ సర్కారుకి జనసైనికుల ఝలక్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల్ని నిలిపిన జనసేన పార్టీ, త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల కోసం గ్లాసు గుర్తుతోపాటు, బ్యాట్‌ గుర్తుని కూడా జనసేన ప్రచారంలోకి తెచ్చింది. ప్రత్యేక కారణాలతో రెండు గుర్తులతో జనసేన, ఈ ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోంది. జనసేన తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుతామని జనసైనికులు ధీమాగా చెబుతున్నారు.

ఇదిలా వుంటే, జనసేన పార్టీకి చెందిన యూత్‌ వింగ్‌ ‘జనసేన స్టూడెంట్స్‌ యూత్‌’ వింగ్‌ కార్యకర్తలు, తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై గళం విప్పారు, ఉద్యమబాట పట్టారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకూ పోరాడతామంటూ ఈ రోజు హైద్రాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళన చేపట్టారు. ప్రధానంగా హైద్రాబాద్‌ వేదికగా జనసైనికులు పోరుబాట పట్టడంతో అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టినట్లుగానే కన్పిస్తోంది.

ఇంటర్‌ ఫలితాల విషయమై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలనీ, విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలనీ, ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాట్లు కల్పించాలనీ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశాకే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మౌనం వీడారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రీ వాల్యూయేషన్‌, రీ వెరిఫికేషన్‌ ఉచితమంటూ ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాదు, త్వరలో జరిగే పోటీ పరీక్షలకు ఇబ్బందుల్లేకుండా చూడాలనీ కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు.

అయినప్పటికీ కూడా విద్యార్థి లోకంలో ఆందోళన తగ్గలేదు. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతోందంటూ ఆందోళన చెందుతున్నారు. జనసేన పార్టీని ట్యాగ్‌ చేస్తూ విద్యార్థులు, తమ తరఫున నిలబడాలని జనసేన పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ విద్యార్థుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేసింది. ప్రభుత్వం కళ్ళు తెరిచేదాకా ఉద్యమం కొనసాగుతుందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో.. జనసైనికులు కదం తొక్కుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ఎన్నికల కోసమే రాజకీయాలు కాదు, రాజకీయం అంటే ప్రజల కోసమని జనసేన పార్టీ తన తాజా కార్యాచరణతో స్పష్టం చేసింది. ముందు ముందు జనసేన చేపట్టబోయే కార్యక్రమాలు మరింత ఉధృతంగా వుంటాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. విద్యార్థులే దేశానికి అతి పెద్ద ఆస్థి అనీ, అలాంటి విద్యార్థుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. చిన్న నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాలు తీసేస్తున్న దరిమిలా, అలాంటి నిర్లక్ష్యానికి ఆస్కారమిచ్చినవారిపై కఠిన చర్యలకు డిమాండ్‌ చేస్తున్నారు జనసైనికులు.

తెలంగాణ రాష్ట్రం లో జన సేన పార్టీ ఉనికే లేదంటూ నిన్న మొన్నటిదాకా విమర్శలు చేసినోళ్ళు కూడా ఇప్పుడు జన సైనికుల ఉత్సాహం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. జనసైనికుల ప్రభంజనం ముందు ముందు పెను సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. జనసేనాని ప్రత్యక్షంగా విద్యార్థులతో మమేకమయ్యేందుకోసం సన్నద్ధమవుతున్నారన్న ఊహాగానాలే నిజమైతే, ఆ తర్వాతి ప్రభంజనం ఊహలకందనిదే అవుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...