తెలుగులో గత ఏడాది బిగ్ బాస్ షో మొదలైంది. మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టి ఆ షో కు మంచి పాపులారిటీ తెచ్చాడు. ఆ తరువాత కొంత గ్యాప్ తో హీరో నాని హోస్ట్ గా రెండో సీజన్ మొదలైంది. అయితే ఆ షో ఆశించ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోకపోవడం, పైగా పలు విమర్శలకు తావివ్వడంతో రెండో సీజన్ ఆశించిన స్థాయిలో రేటింగ్ తెచ్చుకోలేకపోయింది ?
ఇప్పుడు మూడో సీజన్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది బిగ్ బాస్ టీమ్. ఐతే మూడో సీజన్ లో హోస్ట్ గా ఎవరిని పెట్టాలన్న ఆలోచన వారికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటికే వెంకటేష్, నాగార్జున పేర్లు వినిపిస్తున్నాయి. వారితో పాటు ఈ మద్యే టాలీవుడ్ లో సంచలన స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపిస్తుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది కాబట్టి విజయ్ ని పెడితే షో కు బాగా క్రేజ్ వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు కూడా జరుగుతున్నాయి. హోస్ట్ గా నటించేందుకు విజయ్ కి అస్తక్తి ఉందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ఈ రౌడీ హీరో ఈ మద్యే ముంబై లో జరిగిన ఓ షో లో నాకు బుల్లితెరపై కనిపించాలన్న ఆసక్తి లేదు .. బిగ్ స్క్రీన్ పైనే ప్రేక్షకులకు ఎంటర్టైమెంట్ పంచాలని ఉందని చెప్పేసాడు. సో విజయ్ మాటల్లోని ఆంతర్యం మరి బిగ్ బాస్ వారికి వినిపించే ఉంటుంది. అంటే బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేసే ఆలోచన లేదని అర్థం అవుతుంది ? నిజానికి విజయ్ దేవరకొండ అన్నది వెబ్ సిరీస్ ల గురించి.
ముంబై లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ అక్కడ బాలీవడ్ స్టార్స్ మధ్య ప్రత్యేకంగా నిలిచాడు. వెబ్ సిరీస్ లపై మీ అభిప్రాయం ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజయ్ మాట్లాడుతూ తనను తానూ బుల్లితెరపై చూసుకోవాలని లేదు అని చెప్పేసాడు. అయితే భవిష్యత్తులో తాను వెబ్ సిరీస్ నిర్మిస్తానంటూ క్లారిటీ ఇచ్చేసాడు. మరి ఈ విషయం పై బిగ్ బాస్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
942626 807405Basically received my very first cavity. Rather devastating. I would like a super smile. Looking a lot much more choices. Several thanks for the post 168857
968871 298135Just wanna input on few common things, The site layout is perfect, the articles is really superb : D. 999165