రౌడీ హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంచనాలు తలకిందులయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా డివైడ్ టాక్ తో విజయ్ క్రేజ్ బ్రేకులు పడ్డాయి. విషయంలో విజయ్ టెన్షన్ లో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అయన నటించే హీరో, క్రాంతి మాధవ్ సినిమాలు యధాతదంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ తాజాగా మరో దర్శకుడికి ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు తన కెరీర్ లో వంద కోట్ల సినిమాగా గీత గోవిందం సినిమా ఇచ్చిన పరశురామ్ !
ఎస్ మీరు విన్నది నిజమే .. పరశురామ్ గీత గోవిందం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదు. ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ప్రయత్నాలు చేసాడు కానీ అది వర్కవుట్ కాలేదు .. దాంతో ఇప్పుడు విజయ్ తోనే మరో సినిమా చేయాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాజాగా విజయ్ తో చర్చలు కూడా జరిపినట్టు టాక్. తనకు ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గర చేయడమే కాకుండా వందకోట్ల సినిమా ఇచ్చిన దర్శకుడు కాబట్టి పరశురామ్ తో సినిమాకు ఓకే చెప్పాడట విజయ్.
ప్రస్తుతం విజయ్ నటిస్తున్న క్రాంతి మాధవ్ సినిమా ( రన్నింగ్ టైటిల్ బ్రేక్ అప్ ), మైత్రి మూవీస్ లో హీరో సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాల తరువాత పరశురామ్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశము ఉంది. అయితే ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లేదా కొరటాల శివ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
45890 290977You made some decent points there. I looked online for that problem and identified many people goes coupled with with all your internet site. 961458
683133 509313I need to admit that that is one amazing insight. It surely gives a company the opportunity to have in around the ground floor and really take part in making a thing special and tailored to their needs. 337993
50388 659705Oh my goodness! a amazing post dude. Thanks a lot Nevertheless I will likely be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there every person acquiring identical rss problem? Anybody who knows kindly respond. Thnkx 661603