Switch to English

వంశీతో మహేష్‌ మల్టీస్టారర్‌.. ఆ హీరో ఎవరు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇంకా ‘మహర్షి’ సినిమా సక్సెస్‌ జర్నీ నుంచి బయటకు రావడంలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ తొలి రోజు టాక్‌ సంగతెలా వున్నా, వసూళ్ళను బాగానే రాబట్టింది. ప్రస్తుతం మహేష్‌, విదేశీ పర్యటనల్లో బిజీగా వున్నాడు. అది కూడా దర్శకుడు వంశీ పైడపల్లితో కలిసి టూర్‌ చేస్తున్నాడు. మహేష్‌ కుటుంబం, వంశీ పైడిపల్లి విదేశాల్లో టూర్‌ చేస్తూ, ‘మహర్షి’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తోన్న విషయం విదితమే.

తాజా ఖబర్‌ ఏంటంటే, మహేష్‌ మళ్ళీ వంశీతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడట. ఈసారి మహేష్‌ – వంశీ కాంబినేషన్‌లో రాబోయే సినిమా మల్టీ స్టారర్‌ అని అంటున్నారు. వంశీ పడిపల్లి, ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌ని చాలాకాలం క్రితమే తయారు చేశాడనీ, అందులో ఇద్దరు హీరోలకు స్కోప్‌ వుంటుందనీ, ఆ స్టోరీ ఇప్పుడు తాజాగా మహేష్‌ – వంశీ మధ్య చర్చకు వచ్చిందనీ తెలుస్తోంది.

మహేష్‌ సైతం ఈ మల్టీస్టారర్‌ పట్ల ఆసక్తితో వున్నాడట. అయితే, ఇందులో నటించబోయే ఇంకో హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఓ బాలీవుడ్‌ హీరోతోపాటు, ఓ తమిళ హీరో కూడా వంశీ ఆలోచనల్లో వున్నాడట. అయితే, మహేష్‌ మాత్రం తమిళ హీరో అయితే బెటరని అంటున్నాడట.

ప్రస్తుతానికి అనిల్‌ రావిపూడితో కమిట్‌ అయిన మహేష్‌, ఒకవేళ వంశీ పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ని ఈలోగా రెడీ చేస్తే, అనిల్‌ రావిపూడితో సినిమా తర్వాత మహేష్‌ – వంశీతో కలిసి మల్టీస్టారర్‌ చేయడానికి వీలుంటుంది. తమిళ సినీ పరిశ్రమ నుంచి సూర్య పేరుతో, కన్నడ సినీ పరిశ్రమ నుంచి యష్‌ (కేజీఎఫ్‌) పేరు కూడా విన్పిస్తోంది.

మహేష్‌కి మల్టీస్టారర్స్‌ కొత్తేమీ కాదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆల్రెడీ చేసేశాడు. వంశీ పైడిపల్లి సంగతి సరే సరి. ‘ఎవడు’ సినిమా మల్టీస్టారర్‌ లాంటిదే. ‘ఊపిరి’ కూడా ఆ కోవలోకే వస్తుంది. సో, వంశీ తదుపరి సినిమా మల్టీస్టారర్‌ అయితే గనుక, మహేష్‌ ఈ ప్రాజెక్ట్‌కి లైన్‌ క్లియర్‌ చేస్తే గనుక.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్థాయిలో మహేష్‌ – వంశీ నుంచి ఓ మల్టీస్టారర్‌ రావొచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...