కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు విధించిన లాక్ డౌన్ ఎత్తివేసే దిశగా అన్ లాక్ దశలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ లాక్-2 కి సంబంధించిన విధివిధానాలను మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. స్కూళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, మెట్రో రైలు ప్రయాణాల వంటి వాటికి ప్రస్తుతం అనుమతి లేదు.
ఈ నేపథ్యంలో అన్ లాక్-2కి సంబంధించి జనాలు ఏమనుకుంటున్నారు? హోటళ్లకు వెళ్లడం, మెట్రోలో ప్రయాణించడం వంటివాటిపై వారి అభిప్రాయం ఎలా ఉంది అనే అంశంపై ఓ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో 25వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం, కేవలం ఆరు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం, ప్రపంచవ్యాప్తంగా కోటి కేసులు, ఐదు లక్షల మరణాలు దాటేయడం వంటి పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
దీంతో మన జాగ్రత్తల్లో మనం ఉండటం బెటరనే భావనలో ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. సర్వేలో ఇదే అంశం ప్రతిఫలించింది. రాబోయే మూడు నెలల్లో హోటల్ గది బుక్ చేసుకోవడానికి తాము సుముఖంగా లేమని ఏకంగా 93 శాతం మంది స్పష్టంచేశారు. అలాగే జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రదేశాలకు మరికొంతకాలం పాటు దూరంగా ఉంటామని 84 శాతం మంది తేల్చి చెప్పారు.
అన్ లాక్-2లో మెట్రో, లోకల్ ట్రైన్ వంటివాటిని పునరుద్ధరించినా.. తాము ఇప్పట్లో వాటి సేవలను వినియోగించుకోబోమని 67 శాతం మంది వెల్లడించారు. ప్రస్తుతానికి కరోనాను నిరోధించే మందులు మార్కెట్లోకి వస్తున్నా.. వాటిపై పూర్తి భరోసా ఎంత అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. పైగా వ్యాక్సిన్ రావడానికి కనీసం ఏడాది పడుతుందనే వాదన బలపడుతోంది. ఈ నేపథ్యంలో మనం తీసుకునే జాగ్రత్తలే మనకు రక్ష అనడంలో ఎలాంటి సందేహం లేదు.
645302 422945Some truly good stuff on this website, I love it. 634348
587293 123496Wow, superb weblog structure! How long have you been blogging for? you make blogging glance simple. The total look of your internet web site is excellent, neatly as the content material material! 56523
683767 275497Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 471393
902798 227218I like this post a lot. I will definitely be back. Hope that I is going to be able to read far more insightful posts then. Will probably be sharing your information with all of my associates! 61275