వెంకటేష్ మహా-తన తొలి చిత్రం కేరాఫ్ కంచెరపాలెంతో విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకున్నాడు. అత్యంత సహజంగా సినిమాను తెరకెక్కించాడన్న పేరు కూడా సంపాదించుకున్నాడు. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీసాడన్న ఆనందాన్ని కలిగించాడు.
మొదటి సినిమాతోనే సంచలనాలకు తెర తీసిన ఈ దర్శకుడు రెండో సినిమాకు ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకుంటాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. చాలా కాలంగా ఈ విషయంలో సస్పెన్స్ మైంటైన్ చేసిన ఈ దర్శకుడు నిన్న దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
వెంకటేష్ మహా రెండో సినిమా సత్యదేవ్ హీరోగా రూపొందింది. ఒక సింపుల్ యువకుడి రివెంజ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య’గా ఫిక్స్ చేసారు. బాహుబలి వంటి బడా చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటిస్తోంది. ఒక చిన్న వీడియో బిట్ ను కూడా వదిలారు. అది చూసిన వాళ్లకు ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ `మహేశింతే ప్రతీకారమ్`కి రీమేక్ అన్న విషయం అర్ధమైపోయింది.
ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో ఈ దశాబ్దంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమాను అద్భుతమంటూ పొగిడిన వాళ్లే అందరూ. ఇలాంటి గొప్ప సినిమాను రీమేక్ చేయడం మంచి విషయమే కానీ వెంకటేష్ మహా వంటి ‘ఒరిజినల్’ దర్శకుడు ఈ టైప్ అటెంప్ట్ చేస్తాడని ఊహించలేదు ఎవరూ.
దీన్ని బట్టే టాలీవుడ్ లో కథల కొరత ఏ రేంజ్ లో ఉందో అర్ధంచేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఇది కథ కొరత వలనేనా, లేక వెంకటేష్ మహాకు ఈ కథ నచ్చి చేద్దామని ఫిక్స్ అయ్యాడా? ఏదేమైనా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. కేవలం 36 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. ఏప్రిల్ 17, 2020న ఈ సినిమాను విడుదల చేయనున్నామని ఆర్కా మీడియా సంస్థ ప్రకటించింది.
808986 380091Hmm is anyone else experiencing difficulties with the images on this blog loading? Im trying to uncover out if its a issue on my end or if it is the blog. Any feed-back would be greatly appreciated. 650420
988842 842360I must spend some time studying much more or figuring out more. Thank you for great information I used to be in search of this info for my mission. 715971
46338 465585hi, your web site is wonderful. I truly do a lot of thanks for operate 341628
521852 412648very good day, your internet site is low cost. I do a lot of thanks for succeed 545181
39943 942693Spot on with this write-up, I truly suppose this site needs significantly much more consideration. probably be once much more to learn way a lot more, thanks for that info. 229556
119702 383777Directories such given that the Yellow Websites want not list them, so unlisted numbers strength sometimes be alive much more harm than financial assistance. 75211