నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కనుక సినిమాను కాస్త మెల్లగా విడుదల చేయాలనే నిర్ణయంతో యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
సినిమా విడుదలను సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే నాని మరియు శివ నిర్వానల కాంబోలో నిన్ను కోరి సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఒక మెచ్యూర్డ్ ప్రేమ కథాంశంతో రూపొందబోతున్న ఈ సినిమా సంక్రాంతి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కన్నుల వింధుగా కలర్ ఫుల్ గా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందేమో అన్నట్లుగా అనిపించేలా ఈ పోస్టర్ ఉందని ప్రేక్షకుల టాక్.
344869 472917I saw two other comparable posts although yours was the most beneficial so a good deal 883664
224367 337667This is a great subject to talk about. Sometimes I fav stuff like this on Redit. I dont believe this would be the most effective to submit though. Ill take a appear around your website though and submit something else. 413144