Switch to English

ఆర్టీసీ సమ్మె ఇక కంచికేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె 20 రోజులుగా ఉధృతంగా సాగుతోంది. నిరసనలు, ఆందోళనలు, విపక్షాల మద్దతుతో ముందుకెళ్తోంది. ఓ దశలో సకల జనుల సమ్మెకు దారి తీస్తుందా అనే పరిస్థితి కూడా కనిపించింది. ఇంత జరుగుతున్నా అధికార టీఆర్ఎస్ మాత్రం అస్సలు స్పందించలేదు. మాకు ఏం సంబంధం లేదనే రీతిలోనే వ్యవహరించింది. చివరకు హైకోర్టు కలగజేసుకుని చర్చలు జరపాలని ఆదేశించినా.. ఉత్తర్వులు అందలేదంటూ నాలుగు రోజులపాటు జాప్యం చేసింది.

హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత సీఎం కేసీఆర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేశారు. అందులోనూ వారి ప్రధాన డిమాండ్ ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’ అంశాన్ని పక్కన పెట్టారు. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితం అధికార పార్టీకే అనుకూలంగా రావడంతో ఇక సమ్మె కథ దాదాపుగా ముగిసిపోయినట్టే అనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు ఆర్టీసీ సమ్మె కారణంగా అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రబలిందని, అది హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితంలో కనిపిస్తుందని విపక్షాలు భావించాయి. ఆర్టీసీ కార్మికులు కూడా అలాగే భావించారు. కానీ ఫలితం మాత్రం వారి అంచనాలకు భిన్నంగా వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో సాధారణ జనాల్లో ఆర్టీసీ సమ్మె కార్మికులకు మద్దతు లేదని తేలిపోయినట్టేనని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో సమ్మె చేస్తున్నవారు పునరాలోచించక తప్పని పరిస్థితి ఏర్పడినట్టేనని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి ఏమాత్రం ఆసక్తి చూపని సీఎం కేసీఆర్.. గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. బేషరతుగా విధుల్లో చేరడానికి కార్మికులకు ఓ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఒకవేళ అలాంటి పిలుపు ఇస్తే పెద్ద సంఖ్యలో కార్మికులు విధుల్లో చేరడానికి అవకాశం కనిపిస్తోంది.

సంఘాల నేతల వల్లే తమ పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయిందనే ఆవేదన పలువురిలో కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అవకాశం ఇస్తే వారు సమ్మె వీడి తమ విధుల్లో చేరిపోతారనే వాదన వినిపిస్తోంది. కార్మికులకు కేసీఆర్ ఓ ఛాన్స్ ఇస్తారా? లేక తన వైఖరికే కట్టుబడి హైకోర్టు సూచనల మేరకు ముందుకెళ్తారా అనేది ఒకటి లేదా రెండు రోజుల్లోనే తేలనుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...