Switch to English

సైదిరెడ్డి రికార్డ్‌: టీఆర్‌ఎస్‌దే ‘హుజూర్‌’నగర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

హుజూర్‌నగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట.. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్‌ కంచు కోటని టీఆర్‌ఎస్‌ బద్దలుగొట్టింది. ఏదో ఆషామాషీ గెలుపు కాదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిపై విజయం సాధించారు. పద్మావతి తన భర్త ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడ్డారు. ఎన్నికలకు ముందు హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేదనే విశ్లేషణలు విన్పించాయి. పోలింగ్‌ రోజు వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.

కానీ, పోలింగ్‌ రోజున ఈక్వేషన్స్‌ మారిపోయాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, అత్యంత ప్రతిష్టాత్మకంగా హుజూర్‌నగర్‌లో తలపెట్టిన బహిరంగ సభ రద్దయినా, ఓటర్లు మాత్రం టీఆర్‌ఎస్‌ వైపుకే మొగ్గు చూపారు. ‘ఇప్పటిదాకా కాంగ్రెస్‌ని చూశాం.. ఈసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అవకాశం ఇస్తాం..’ అని బాహాటంగానే హుజూర్‌నగర్‌ ప్రజలు చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ‘అధికార పార్టీని గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది.. వేరే ఏ పార్టీ గెలిచినా, ఆ పార్టీలోనే ఆ వ్యక్తి వుంటాడన్న గ్యారంటీ ఏముంది.?’ అని కూడా హుజూర్‌నగర్‌ ప్రజలు ప్రశ్నించారు.

అదే సమయంలో కొందరు మాత్రం, అధికార పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మిగతా విషయాలెలా వున్నా, టీఆర్‌ఎస్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో డీలాపడింది. ఇక, బీజేపీతోపాటు తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకోవడం దండగ.. అనే స్థాయికి హుజూర్‌నగర్‌ ప్రజలు ఆ రెండు పార్టీల్నీ తిరస్కరించారు. చిత్రంగా మూడో స్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి నిలిచారు హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి సంబంధించి. మొత్తంగా 40 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి ఘన విజయం సాధించారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....