నందమూరి అందగాడు బాలయ్యకు డై హార్డ్ ఫాన్స్ ఎంతమంది ఉన్నారో .. అంతకు మించే .. యాంటీ బాలయ్య ఫాన్స్ కూడా ఉన్నారు. బాలయ్య సినిమాల డైలాగ్స్, స్టెప్పులతో యాంటీ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా నానా రచ్చ చేయడం. దానికి బాలయ్య ఫాన్స్ తిరిగి కౌంటర్లు వేయడం .. అన్నది పరిపాటిగా జరుగుతున్న తంతే !! తాజాగా బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు సంబందించిన ఓ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో బాలయ్య చీపురు పట్టుకున్న స్టిల్ రియాలిటీకి దగ్గర ఉండడం విశేషం.
తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన రూలర్ సినిమా ఇటీవలే విడుదలై ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా విషయంలో నందమూరి ఫాన్స్ మొదటి నుండి మొత్తుకుంటూనే ఉన్నారు .. మళ్ళీ ఆ దర్శకుడితో చేయొద్దని. అంతకుముందు అదే దర్శకుడితో చేసిన జై సింహా యావరేజ్ గా ఆడింది. అందుకే వద్దన్నారు. ఇక తాజాగా రూలర్ కు సంబందించిన ఓ పోస్టర్ ని గోడకు అతికేసారు .. అందులో ఉన్న బాలయ్య ఫోటోకి దగ్గరగా చీపురు పెట్టి ఫోటో తీస్తే .. నిజంగా అది బాలయ్య పట్టుకున్నట్టే ఉంది. అంతే ఇంకేముంది .. ఆ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, షేర్ చేయడం .. అది రచ్చ గా మారడం వెంట వెంటనే జరిగిపోయాయి.
అయితే ఈ పోస్టర్ పోస్ట్ చేస్తూ .. ఇది ఎవరిని కించపరచడానికి కాదంటూ కామెంట్ కూడా పెట్టారు సుమ ! ఈ సినిమాలో బాలయ్య చేతిలో చీపురు పర్ఫెక్ట్ గా ఉందంటూ, ఇందులో బాలయ్య విగ్గు పై బోలెడన్ని కామెంట్స్ పడుతున్నాయి. ముక్యంగా ఈ వయసులో కూడా బాలయ్య డాన్సులు ఇరగ్గొట్టాడని అంటున్నారు.
361162 433104enjoy your imagination!!!! excellent work!! oh yeah.. cool photography too. 144889
382213 153257What a lovely blog. I will surely be back. Please keep writing! 826405
437379 177241I actually like your writing style, good info , thankyou for putting up : D. 251780