సడెన్ గా మలయాళ సినిమాలపై మనసు మళ్లింది మెగాస్టార్ చిరంజీవికి. తాను ఇప్పుడు చేస్తున్న ఆచార్య సినిమా తర్వాత వరసగా రెండు మలయాళ సినిమాల రీమేక్స్ ను చేయనున్నాడు మెగాస్టార్. అందులో మొదటగా మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫెర్ లో నటించనున్నాడు. ఈ చిత్రానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్న సంగతి తెల్సిందే. సాహో ప్లాప్ అయినా కూడా తన స్టైలిష్ టేకింగ్ పైన నమ్మకముంచిన చిరు, సుజీత్ ను లూసిఫెర్ రీమేక్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడు.
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సుజీత్ స్క్రిప్ట్ లో మార్పులు పూర్తి చేసాడు. స్క్రిప్ట్ రెడీగా ఉంది. చిరంజీవి ఎప్పుడు సై అంటే అప్పటినుండి షూటింగ్ ను మొదలుపెట్టడానికి సుజీత్ కూడా సిద్ధమవుతున్నాడు. లూసిఫెర్ లో హీరో పాత్ర తర్వాత సిస్టర్ పాత్ర చాలా కీలకమైంది. మలయాళంలో ఆ పాత్రను మంజు వారియర్ పోషించింది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ పాత్ర కోసం సీనియర్ నటి సుహాసిని పోషించబోతున్నట్లు వినికిడి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా మార్పులు చేసిన సుజీత్ చిరంజీవి ఇమేజ్ ను కూడా దృష్టిలో ఉంచుకుని మరిన్ని కమర్షియల్ అంశాలను కూడా దట్టించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.
378951 837032Precisely what I was looking for, thankyou for putting up. 242908
898745 869046This design is steller! You most undoubtedly know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own weblog (effectively, almostHaHa!) Fantastic job. I really loved what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 246245
823666 511925Thank you for the auspicious writeup. It in truth used to be a amusement account it. Glance complex to more added agreeable from you! However, how could we be in contact? 403658