Switch to English

అయిపాయె.. సినీ పరిశ్రమ ఖేల్ ఖతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఓ వైపు రాజకీయం, ఇంకో వైపు ఒమిక్రాన్.. తెలుగు సినీ పరిశ్రమపై అతి భయంకరమైన దాడి చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. తెలుగు సినీ పరిశ్రమకే కాదు, అన్ని సినీ పరిశ్రమలకీ ఇదే సమస్య. తెలుగు సినీ పరిశ్రమ కాస్త వేగంగానే కోలుకోవడానికి ప్రయత్నించింది.

ఏ ఇతర సినీ పరిశ్రమల్లోనూ లేనంత వేగంగా తెలుగునాట సినిమాలు రూపొందుతున్నాయి, థియేటర్లలోకి వస్తున్నాయి. తెలంగాణలో అయితే, పెద్దగా తెలుగు సినిమాకి ఇబ్బందులేమీ లేవు. పైగా, తెలుగు సినిమా కష్టాల్ని గుర్తెరిగి, తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయమై వెసులుబాటు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కూడా.

కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం తెలుగు సినిమాని చిన్నచూపు చూస్తోంది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లు మూతబడుతున్నాయి. సినిమా థియేటర్లను సంస్కరించే క్రమంలో, ఎగ్జిబిటర్లను అయోమయంలోకి నెట్టేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

దేశంలో అతి పెద్ద స్క్రీన్ కలిగిన యువీ థియేటర్ సైతం మూతపడిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్ట్రెయిట్ రిలీజ్.. అన్న విషయాన్ని తెలుగు సినీ పరిశ్రమ మర్చిపోవాలేమో.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

ఈ రాజకీయ వేధింపులు ఇలా వుంటే, ఇంకో వైపు కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్, తెలుగు సినిమాపై పిడుగులా పడబోతోంది. మహారాష్ట్రలో కోవిడ్ 19 ఆంక్షలు మళ్ళీ షురూ అయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలూ రేపో మాపో ఆంక్షలు విధించనున్నాయి.

కోవిడ్ భయం మొదలవగానే ముందుగా దెబ్బ పడేది సినిమా థియేటర్లకే. తెలుగు సినీ పరిశ్రమ నుంచి రెండు పాన్ ఇండియా సినిమాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి. వాటి భవితవ్యం ఇప్పుడు అయోమయంలో పడింది.

7 COMMENTS

  1. 819662 661835My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show created for people who discover themselves preparing to drop extra pounds and furthermore ultimately keep a considerably healthier habits. la weight loss 930753

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...