Hanuman : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీ అన్నట్లుగా హనుమాన్ ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర ఉంటుంది అంటూ ఇప్పటికే విడుదల అయిన ప్రోమో మరియు ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు. అయితే టీజర్ లో హనుమంతుడి పాత్ర ను చూపించిన సమయంలో కళ్లను మాత్రమే చూపించారు. ఆ కళ్లు కచ్చితంగా మెగాస్టార్ కళ్లు అన్నట్లుగా ప్రచారం జరిగింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా హనుమంతుడిగా చిరంజీవి కళ్ల ను వినియోగించినట్లుగా చెప్పకనే చెప్పాడు. దాంతో సినిమాలో కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవిని చూడబోతున్నామని అంటున్నారు. చిరంజీవి ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అవ్వబోతున్న విషయం తెల్సిందే. 12వ తారీకున ఎలాంటి సర్ప్రైజ్ లను దర్శకుడు ఇవ్వనున్నాడో చూడాలి.