పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వివాదం ఈనాటిది కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య రచ్చకు కారణమైంది ఈ ప్రాజెక్ట్. అప్పట్లో ఆ వివాదం చినికి చినికి గాలి వానగా మారి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపు తెచ్చిందనుకోండి.. అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు అదే పోతిరెడ్డిపాడు.. మళ్ళీ రాజకీయ రచ్చకు కేంద్ర బిందువైంది. అప్పట్లో రెండు ప్రాంతాలు.. ఇప్పుడు అవే రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా మారాయి. అంతేనా, రెండు రాష్ట్రాల మధ్యనే కాక రెండు ప్రాంతాల మధ్య, రెండు సామాజిక వర్గాల మధ్య కూడా ఈ ప్రాజెక్టు చిచ్చపెట్టేలా వుంది.
పోతిరెడ్డిపాడు విషయమై టీడీపీ వైఖరేంటని అధికార వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం టీడీపీ వైఖరితో అధికార వైసీపీకి సంబంధమేంటి.? టీడీపీకి అసెంబ్లీలో వున్న బలమెంత.? ఆ పార్టీ వద్దంటే రాష్ట్రంలో ఏ పని అయినా ఆగిపోతుందా.? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పేరులో ‘రెడ్డి’ వుంది కాబట్టి, కమ్మ పార్టీ అయిన టీడీపీకి ఆ ప్రాజెక్టు నచ్చదన్నది బులుగు బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం తాలూకు సారాంశం. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం.
అమరావతిని కమ్మరావతిగా అభివర్ణిస్తూ, రెండేళ్ళుగా రాష్ట్ర రాజధానిలో అభివృద్ధిని పడకేసిన అధికార వైసీపీ, కుల రాజకీయాల గురించి మాట్లాడితే ఇలాగే వుంటుంది మరి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పేరులో ‘రెడ్డి’ మాత్రమే కాదు, ‘పాడు’ కూడా వుంది. అందుకే, ఛీ పాడు రాజకీయం.. ఎన్నో ఏళ్ళుగా అలా అలా నడుస్తూనే వుందేమో.
తెలంగాణ రాష్ట్ర సమితి అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం లాంటిదే. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, వైసీపీకి సహకరించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమవుతోందన్న విమర్శలున్నా, ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చారాయె.
ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం గతంలో తలెత్తితో, అప్పట్లో జల దీక్ష చేశారు వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో. ఇప్పడాయన, కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడేందుకూ సుముఖత వ్యక్తం చేయడంలేదు. పోతిరెడ్డిపాడు విషయమై వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బండ బూతులు తిడుతున్నారు తెలంగాణ నేతలు. వారికి ధీటుగా సమాధానం చెప్పలేక, వైసీపీ నేతలు.. టీడీపీని ఈ ‘పాడు’ రాజకీయంలోకి లాగి, అది చాలక, ‘రెడ్డి’ రాజకీయాన్ని తెరపైకి తెస్తున్నారన్నమాట.
228542 592832Aw, i thought this was an really good post. In idea I would like to invest writing in this way moreover – taking time and actual effort to manufacture a really good article but exactly what do I say I procrastinate alot and no means apparently go completed. 673753
940541 966345hello I was quite impressed with the setup you used with this web site. I use blogs my self so excellent job. definatly adding to bookmarks. 122454
750514 820046Quite fascinating subject , thanks for putting up. 757495