Switch to English

కోడెల ఆత్మహత్య: తిలా రాజకీయం తలా పిడికెడు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణాన్ని రాష్ట్రంలోని అధికార, విపక్షాలు ఎంత రాజకీయం చేయాలో అంతా చేసేశాయి. అధికార పార్టీ ఒక రకంగా ఆయన్ను ఇబ్బంది పెడితే.. తెలుగుదేశం పార్టీ మరో రకంగా కోడెలపై కక్ష సాధించింది. ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోని టీడీపీ అధినేత చంద్రబాబు.. కోడెల ఆత్మహత్య తర్వాత చేసిన రాజకీయం చూస్తే.. రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని బాధ కలగక మానదు.

కోడెల ఆత్మహత్యను అనుకూలంగా మలుచుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి టీడీపీతోపాటు ఆ పార్టీ అనుకూల మీడియా పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎలాగైనా వైఎస్సార్ సీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ వినియోగించుకున్నాయి. అయితే, ఈ క్రమంలో తెలియకుండా కోడెలపై అవే బురద చల్లాయి. ఫర్నిచర్ కేసే ప్రాణం తీసిందా అంటూ కథనాలు కుమ్మేశారు. ఆ ఫర్నిచర్ ఎలా వచ్చింది? దానిని కోడెల ఎక్కడ ఎలా వినియోగించుకున్నారు? అనంతరం ఏయే సెక్షన్లపై కేసులు నమోదు చేశారు వంటి వివరాలను వెల్లడించడంతో అప్పటివరకు ఇది ఏదో కావాలని పెట్టిన కేసు అని భావించనవారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.

కోడెల పోరాటయోధుడు అని టీడీపీ నేతలు కీర్తిస్తూనే ఈ చిన్న కేసు వల్లే మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారంటూ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. కోడెల చనిపోవడానికి ముందు 24 నిమిషాలపాటు మాట్లాడిన ఫోన్ కాల్ ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినా.. కేవలం ఫర్నిచర్ కేసు వల్లే కోడెల చనిపోయారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అదే పనిగా చెబుతూ వచ్చింది. ఫర్నిచర్ కేసు విషయాన్ని ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీడీపీ మీడియా మాత్రం పదదేపదే అదే విషయాన్ని చెబుతూ జనాల్లో కొత్త అనుమానాలు కలిగేలా చేసింది.

ఒక్క ఫర్నిచర్ కేసు మినహా మిగిలిన కేసులన్నీ నిజమే అనిపించేలా వారి వాదనలు సాగాయి. ఇక చంద్రబాబు సైతం కోడెల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆయన అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వకుండా దూరం పెట్టడంమే కాకుండా కోడెలను కేసులు చుట్టుముట్టినప్పుడు ఆయనకు అండగా కూడా నిలబడలేదు.

కోడెల అస్వస్థతకు గురై (అది ఆత్మహత్యాయత్నం అని ఇప్పుడు చెబుతున్నారు) గుంటూరు ఆస్పత్రిలో ఉన్నప్పుడు కనీసం పరామర్శించలేదు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆయన మరణాన్ని కూడా రాజకీయంగా వినియోగించుకున్నారనే ఆరోపణలొచ్చాయి. మొత్తానికి అందరూ కలిసి ఓ రాజకీయ తరంగాన్ని అణిచివేశారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు కోడెల ఆత్మహత్యకు అందరూ కారణమే అని చెప్పడం ఎంతమాత్రం తప్పు కాదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన ఇదే

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రముఖ...