Switch to English

తమన్నా – శృతిహాసన్‌: ఓ పెళ్లి గోల.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

హీరో ప్రబాస్‌ని అందరూ డార్లింగ్‌ అని పిలుస్తారు. అసలు ఈ డార్లింగ్‌ అనే పిలుపుని ప్రాచుర్యంలోకి తెచ్చిందే ప్రబాస్‌. తన సినిమాల్లో విరివిగా డార్లింగ్‌ అనే మాట ఉపయోగిస్తుంటాడు ప్రబాస్‌. అంతేకాదు, ‘డార్లింగ్‌’ పేరుతో ఓ సినిమా కూడా చేసేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌నీ, తోటి హీరోల్నీ, దర్శకుల్నీ డార్లింగ్‌ అని పిలిచినంత మాత్రాన అది తేడా వ్యవహారమని అనగలమా.? అనలేం. అభిమానించే వ్యక్తుల్ని ప్రేమగా పిలుచుకునేందుకు ‘డార్లింగ్‌’ అనే మాటను ఉపయోగిస్తుంటాడు ప్రబాస్‌.

ఇప్పుడీ ప్రబాస్‌ ‘డార్లింగ్‌’ విషయం ఎందుకంటే, ఇద్దరు హీరోయిన్ల మధ్య డార్లింగ్‌ పిలుపు వివాదాస్పదమైంది కనుక. ఆ ఇద్దరిలో ఒకరు తమన్నా కాగా, ఇంకొకరు శృతిహాసన్‌. ‘తమన్నాని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..’ అని శృతి ఓ సందర్భంలో సరదాగా చెబితే మీరిద్దరూ లెజ్బియన్లా.? అని నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. మొదట్లో ఇటు తమన్నా కానీ, అటు శృతిహాసన్‌ కానీ, ఈ ట్రోలింగ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ‘శృతి అడిగితే నేనూ కాదనను..’ అంటూ ఫన్నీగా తమన్నా కూడా స్పందించింది గతంలో. ఆ తర్వాత మళ్లీ ఇద్దరి పైనా ట్రోలింగ్‌ చాలా తీవ్రంగా జరిగింది.

ఈ వివాదంపై తాజాగా తమన్నా స్పందించింది. సరదాగా తీసుకోవాల్ని సీరియస్‌గా తీసుకుని అర్ధం పర్ధం లేని వివాదాల కోసం సోషల్‌ మీడియాని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనీ అభిప్రాయపడింది తమన్నా. వర్క్‌ ప్లేస్‌లో స్నేహ పూర్వకమైన వాతావరణం కోసం చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక్కోసారి ఆ స్నేహం ఆఫ్‌ స్క్రీన్‌ కూడా కొనసాగుతుంది. అదే మా ఇద్దరి విషయంలోనూ జరిగిందని తమన్నా చెప్పింది. ఇదే అభిప్రాయాన్ని శృతిహాసన్‌ కూడా పలుమార్లు వెలిబుచ్చింది.

ప్రస్తుతం శృతి హాసన్‌, మైఖేల్‌ కోర్స్‌లే అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. వీరి ప్రేమకి కమల్‌హాసన్‌ నుండి కూడా ఎప్పుడో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. పెళ్లి గురించి మాత్రం ఇప్పుడప్పుడే తానేమీ చెప్పలేనని శృతిహాసన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కాగా శృతి – తమన్నా మధ్య స్నేహం దాని చుట్టూ జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి తెలుసుకున్న మైఖేల్‌ కోర్స్‌లే విషయమేంటని శృతిహాసన్‌ని అడిగాడట. తమన్నాతో కూడా మాట్లాడాడట. విషయం తెలుసుకుని సరదాగా నవ్వుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా తమన్నా వెల్లడించింది.

ఇటీవలి కాలంలో శృతి హాసన్‌ పెద్దగా సినిమాలేమీ చేయడం లేదు. ఒక టెలివిజన్‌ షో మాత్రం నిర్వహిస్తోంది. అయితే, కొరటాల శివ – చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా కోసం శృతిహాసన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా విషయానికి వస్తే, ఆమె నటించిన ‘అభినేత్రి 2’ విడుదలకు సిద్ధమైంది. ప్రభుదేవా, నందితా శ్వేతా ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ప్రభుదేవా – తమన్నా కలిసి గతంలో చేసిన ‘అభినేత్రి’కి ఇది సీక్వెల్‌.

లక్ష్మీరాయ్‌ – సనా మక్బూల్‌ (‘దిక్కులు చూడకు రామయ్యా’ ఫేం) చాలా మంచి స్నేహితులు. రాశీ ఖన్నా – వాణీ కపూర్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చెప్పుకుంటూ పోతే ఇలా చాలా మందే కనిపిస్తారు. స్నేహాన్ని అక్రమ సంబంధం అనుకునే స్థాయికి కొందరు నెటిజన్లు దిగజారిపోవడం దురదృష్టకరం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...