‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ ఓ పక్క జోరుగా సాగుతున్నాయి. ముంబై, చెన్నయ్‌లలో ప్రమోషన్స్ అనంతరం నిర్మాత రామ్‌చరణ్, హీరో చిరంజీవి బెంగళూరులో ఈ రోజు జరగనున్న ప్రీ-రిలీజ్ హంగామాలో పాల్గొంటున్నారు. ఇంతకీ దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కడ.? నిజానికి, సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూల హంగామా ముందే ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ పరంగా సురేందర్ రెడ్డి చెయ్యాల్సిందంతా చేస్తున్నాడు. అయితే, సినిమా రిలీజ్‌కి ముందు అతి ముఖ్యమైన అంవాలపై సురేందర్ రెడ్డి ఫోకస్ పెట్టాడు.
తాజాగా ఐదు లాంగ్వేజెస్‌కి సంబంధించిన ‘డిఐ’ పూర్తయ్యింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించాడు.
‘ప్రతి సినిమాకీ కష్టపడే పని చేస్తుంటాం. కానీ, ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. పన్నెండేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా ప్రయాణం నా దగ్గరకు రావడమే ఓ అద్భుతం. నా చేతుల ద్వారా ఓ వీరుడి చరిత్రను ప్రజలకు చెప్పే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా వుంది. చిరంజీవి లాంటి వ్యక్తి హీరోగా నటిస్తేనే ఆ చరిత్ర మరింత ఎక్కువమందికి చేరువవుతుంది. ఈ సాహసం బహుశా నిర్మాతగా చరణ్ తప్ప ఇంకెవరూ చేయలేరేమో. తొలుత నేనూ ఈ సినిమా విషయంలో కొంత భయపడ్డాను. అయితే నా వెనుక నిర్మాతగా చరణ్ వున్నాడనే ధైర్యంతో ముందడుగు వేశాను. ఒక్కటి మాత్రం చెప్పగలను. సినిమా చూశాక, దేశభక్తి ఉప్పొంగే మనసుతో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకొస్తాడు. సినిమాని ఎమోషనల్ సీన్స్ నడిపిస్తాయి. ఈ వయసులో చిరంజీవి ఇంతటి రిస్కీ స్టంట్స్ చేస్తారని నేను ఊహించలేదు. మేం వారించినా ఆయన తగ్గలేదు.. చేయగలనని ముందుకొచ్చారు. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ సినిమాకి మరింత బలాన్ని తెచ్చింది..’ అంటూ సురేందర్‌రెడ్డి, సైరా నరసింహారెడ్డి సంగతుల గురించి చెప్పుకొచ్చారు.
ముంబై, చెన్నయ్ ప్రమోషన్లలో సురేందర్ రెడ్డి కనిపించకపోవడం వెనుక అసలు కథ, సినిమా విడుదలకు ముందు చక్కబెట్టాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమాలే. ఆ పనులు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
956690 293097Paper rolls really great read you know alot about this topic i see! 165041
768533 650068Really good style and design and outstanding content material , nothing at all else we require : D. 857617
805172 28545Sweet web site, super style and style , really clean and use friendly . 758688
798318 392347A weblog like yours need to be earning much money from adsense..-., 865099
416590 802102Shame on the seek Google for now not positioning this post upper! Come on over and visit my site. 885310
868283 453277Its practically impossible to find knowledgeable men and females during this subject, nonetheless you sound like do you know what you are discussing! Thanks 658218