Switch to English

ఇంటర్వ్యూ: రామ్ చరణ్ ని నా చేత్తో చంపాలి, అది నా వల్ల కాలేదు – చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం ఇండియా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేస్తూ గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఈ చిత్ర టీం అన్ని మేజర్ సిటీస్ తిరుగుతూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో సైరా గురించి అందరూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. కానీ అన్ని చోట్లా చిరంజీవి చెప్పిన విషయాల్లో నుంచి ప్రేక్షకులకి తెలియని కొన్ని విశేషాలు మీకోసం.

‘సైరా’లో రామ్ చరణ్ లేకపోవడానికి అసలు కారణం..

‘సైరా’లో ఇంటర్వల్ ముందు వచ్చే షేర్ ఖాన్ పాత్రలో చరణ్ ని అనుకున్నాం. చరణ్ తో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లను కూడా అడిగాం. వాళ్ళు చేయడానికి ఓకే అన్నారు. కానీ చిత్ర టీం మాత్రం చరణ్ నే ఎక్కువ సజెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. ఒక వార్ సీన్ లో షేర్ ఖాన్ పాత్ర ‘సైరా నరసింహారెడ్డి’ నీలాంటి వాడు దేశానికి అవసరం’ అనే డైలాగ్ చెప్పి నా చేతిలోని కత్తితో తానే పొడుచుకొని నా చేతిలో చనిపోతాడు. చరణ్ పాత్ర నా చేతిలో చనిపోవడం యాంటీ సెంటిమెంట్ అని, ప్రేక్షకులు తీసుకోలేరని అనుకోని ఆలోచనలో ఉండగా, లెంగ్త్ ఇష్యూ వచ్చినప్పుడు పూర్తిగా తీసేసాం.

‘సైరా’లో పాటల గురించి..

మొత్తం నాలు పాటలు చేసాం.. కానీ సినిమాలో రెండే ఉంటాయి. సినిమా రిలీజయ్యాక పరిస్థితిని బట్టి తమన్నా కి నాకు వచ్చే వచ్చే ద్యూయేట్ ని యాడ్ చేస్తాం.

‘సైరా’ చూసినవారిలో బెస్ట్ కాంప్లిమెంట్..

మా అమ్మగారు ‘సైరా’లో నా గెటప్ చూసి సంబరపడిపోయింది. సినిమా చూసాక శంకర్ బాబూ.. నువ్వు నువ్వులా లేవు, ఎవరో ఓ మహానుభావుడిని చూస్తున్న ఫీలింగ్ ఉందని అన్నారు. అలాగే మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రాడ్స్ లో అభిమానుల మధ్య సినిమా చూడాలనేది ఆమె కోరిక.

నేను, పవన్ కళ్యాణ్ తీర్చలేని కోరికని చరణ్ తీర్చాడు..

సురేఖ ‘సైరా’ చూసాక,ఎంత పెద్ద హీరోలైనా మీరు, బావమరిది కళ్యాణ్ బాబు నాకు సినిమా తీసే అవకాశం ఇవ్వలేదు. కానీ నా కుమారుడు సైరా లాంటి గొప్ప సినిమాకి సమర్పించే అవకాశం నాకు ఇచ్చాడు. చెప్పాలంటే సైరా విషయంలో నాకన్నా రామ్ చరణ్ విషయంలోనే గర్వంగా ఫీలవుతోంది.

అమితాబ్ బచ్చన్ సురేఖ వంటలకి ఫిదా..

అమితాబ్ గారు అడగ్గానే ఆయన ఖర్చులు కూడా ఆయనే పెట్టుకొని సుమారు 7 రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు. కానీ భోజనం మాత్రం మా ఇంటి నుంచే వచ్చేది. కానీ ఆయన వెజిటేరియన్, అలాగే రైస్, ఇడ్లీ, దోశ, చపాతీ లాంటివి తినరు అందుకే సురేఖ ప్రత్యేకంగా దగ్గరుండి చిరుధాన్యాలతో ఇడ్లీ, దోశ చేసివ్వడం. కినోవాతో బిర్యాని చేసి పంపేది. లా పంపిన ఐటమ్స్ అన్నీ ఆయనకి తెగ నచ్చేసి తన చెఫ్ ని పంపించి ఆ వంటల తయారీ విధానం నాట్ చేసుకొని వెళ్లారు. వెళ్ళేరోజు కూడా స్పెషల్ గా సురేఖ కారికి థాంక్స్ చెప్పండి అని వెళ్ళాడు.

పవన్ కళ్యాణ్ గురించి..

విభేదాల విషయం: మా ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చింది, విభేదాలు వచ్చాయి అనే మాట అవాస్తవం. అవన్నీ ఈ మీడియా వారు సృష్టించినవే. అలాంటివి విన్నప్పుడు బాధేస్తుంది. కానీ మేము అలాంటివి లైట్ తీసుకుంటాం, అమ్మ దగ్గర కలిసిన ప్రతిసారి బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ మా మధ్య పాలిటిక్స్ చర్చలు అస్సలు ఉండవు.

రాజకీయ భవిష్యత్: కళ్యాణ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలకన్నా సొసైటీని ఎక్కువ ప్రేమించేవాడు. అందుకే వాడికి అవకాశం వస్తే అద్భుతంగా పరిపాలిస్తాడు. ఆ సత్తా సామర్ధ్యాలు వాడిలో ఉన్నాయని మాత్రం చెప్పగలను..

ఆర్ఆర్ఆర్ గురించి..

‘సైరా’ షెడ్యూల్ బ్రేక్ టైంలో ఒకసారి నేను సురేఖ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్లాం. ఆ రోజు అప్పటికి పూర్తిగా అల్లూరి సీతారామరాజుగా పాత్ర పరిణితి చెందక ముందు చరణ్ పై వచ్చే ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నారు. కొందరు రామ్ చరణ్ ని బాగా కొట్టి, కిందేసి తొక్కుతూ ఈడ్చుకెళ్లే సీన్ చేస్తున్నారు. అది చూడగానే ఓకే నటుడిగా నాలో ఉద్వేగం కలిగింది. కానీ అమ్మగా సురేఖ అది చూడలేకపోయింది.

చిరు తదుపరి సినిమాల గురించి..

కొరటాల శివ: ఇప్పటి వరకూ చేసిన సినిమాల టైపులోనే కొరటాల ఈ సినిమాలో కూడా సామాజిక ప్రయోజనం ఉంటుంది. అక్టోబర్ లో అధికారికంగా లాంచ్ చేసి, నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్: పక్కా 100% కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పటికైతే లైన్ చెప్పారు నచ్చింది, ప్రస్తుతం పూర్తి కథ చేసే పనిలో ఉన్నారు.

‘సైరా’తో చారిత్రం చేసేసారు ,ఇక పౌరాణికమే మిగిలింది..

‘సైరా’తో చారిత్రక సినిమా చేసాను. ఈ సినిమాతో గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాల అనుభూతి నాది. ‘సైరా’ తో ఇన్నాళ్ళకి నటుడిగా నా ఆకలి తీరింది. ప్రస్తుతానికైతే పౌరాణికం లేదు లిస్టులో..

‘సైరా’ సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు..

భారీ బడ్జెట్, వార్ ఎపిసోడ్స్, బిగ్ ఫైట్స్ ఇలా ఎన్నో విషయాల్లో కష్టపడ్డా ఫైనల్ ప్రోడక్ట్ చూసాక ఆ బాధ మొత్తం పోయింది. మా శ్రమ, రేపు ప్రేక్షకులు అందించే విజయం ఇలాంటివి పక్కన పెడితే, నా కెరీర్ ప్రారంభంలో విడువులైన ‘శంకరాభరణం’, ఇటీవల వచ్చిన ‘బాహుబలి’ సినిమాల్లా ‘సైరా’ కూడా మనకు జాతీయంగా, అంతర్జాతీయంగా మనకి గౌరవం తెచ్చిపెట్టే సినిమాగా సినీ చరిత్రలో మిగిలిపోతుందనేది నా నమ్మకం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...