మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘సైరా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉన్న మెగాస్టార్ చిరు సైరా కి సంబందించిన ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా ఎన్.టి.ఆర్ – రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా’ఆర్ఆర్ఆర్’ మూవీ గురించి ఒక ఎమోషనల్ సీన్ గురించి రివీల్ చేయడం విశేషం.
ఓ ఇంటర్వ్యూ లో చిరు మాట్లాడుతూ ‘ సైరా షెడ్యూల్ బ్రేక్ టైంలో ఒకసారి నేను సురేఖ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్లాం. ఆ రోజు అప్పటికి పూర్తిగా అల్లూరి సీతారామరాజు గా మారక ముందు చరణ్ పై వచ్చే ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నారు. కొందరు రామ్ చరణ్ ని బాగా కొట్టి, కిందేసి తొక్కుతూ మట్టిలో లాక్కొని వెళ్ళే సీన్ చేస్తున్నారు. అది చూడగానే ఓకే నటుడిగా నాలో ఉద్వేగం కలిగింది. కానీ అమ్మగా సురేఖ అది చూడలేకపోయిందని’ చిరు తెలిపారు. ఇలా చిరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఒక కీలక ఘట్టంలో వచ్చే ఎమోషనల్ సీన్ కంటెంట్ ని లీక్ చేశారు.
‘సైరా’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కంప్లీట్ గా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో పాల్గొననున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం పెంచిన మీసం లుక్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
523549 629281A actually exciting examine, I may possibly not concur entirely, but you do make some truly legitimate points. 741087
685639 50848I really like forgathering utile information, this post has got me even far more information! . 177090
86051 195524This internet web site is my breathing in, genuinely excellent layout and perfect content material . 137499