Switch to English

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో జగన్‌ సర్కార్‌కి మరో ఝలక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ‘కుల ముద్ర’ వేసి మరీ, ఆయన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన ఆర్డిరెన్స్‌ని హైకోర్టు ఇటీవల కొట్టి పారేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించిన కనగరాజ్‌ నియామకం చెల్లకుండా పోయింది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తాను ‘రీస్టోర్‌’ అయ్యానని భావించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, తన విధుల్లో కొనసాగేందుకు ప్రయత్నిస్తే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. సాక్షాత్తూ అడ్వొకేట్‌ జనరల్‌ని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రంగంలోకి దించింది.

మరోపక్క, హైకోర్టు తీర్పుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు తీర్పుపై ‘స్టే’ విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ‘ఆర్డినెన్స్‌ జారీలో ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా, నమ్మదగ్గవిగా లేవు’ అని సుప్రీం వ్యాఖ్యానించిందని ప్రముఖ న్యాయవాది జంద్యాల రవిశంకర్‌ పేర్కొన్నారు.

‘తొలి నిమిషంలోనే రాష్ట్ర ప్రభుత్వ వాదనపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ బద్ధమైన పదవుల విషయంలో ఆటలాడొద్దంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది’ అని జంద్యాల రవిశంకర్‌ చెప్పుకొచ్చారు. కాగా, ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరోపక్క, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తిరిగి తన విధుల్ని కొనసాగించేందుకు ఇప్పుడు మార్గం మరింత సుగమం అయ్యిందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకీ – రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కీ మధ్య వివాదం తెరపైకొచ్చింది. ఎలాగైనా స్థానిక ఎన్నికల్ని నిర్వహించేయాలని అధికారపక్షం భావిస్తే, కరోనా ప్రమాద తీవ్రతను ముందుగా అంచనా వేసిన అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా తీవ్రత అనూహ్యంగా పెరగడం తెల్సిన విషయమే.

ఇదిలా వుంటే, అధికార పార్టీ అరాచకాల్ని ప్రశ్నించినందుకే నిమ్మగడ్డపై కుట్రపూరితంగా జగన్‌ ప్రభుత్వం వేటు వేసిందని విపక్షాలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం విదితమే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...