Switch to English

Karnataka: కర్ణాటక కాంగ్రెస్ కి ‘హస్తం’ అందించిన తెలుగోడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

Karnataka: ‘మిస్టర్ కె’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు గురించే చర్చ. ఎవరీ ‘మిస్టర్ కె’?. అర్థంతరంగా ఆయన పేరు ఇప్పుడు ఎందుకు తెరమీదకి వచ్చినట్టు? కర్ణాటక లో కాంగ్రెస్ విజయ వెనక ఈయన ప్రమేయం ఏంటి? అని సర్వత్రా చర్చ నడుస్తోంది. సునీల్ కనుగోలు( Sunil Kanugolu).. తెలుగు మూలాలున్న వ్యక్తి. కర్ణాటకలోని బళ్ళారి లో పుట్టారు. చదువు నిమిత్తం చెన్నై లో స్థిరపడ్డారు. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే కొన్నాళ్లపాటు ఉన్నారు. తర్వాత ఇండియాకి వచ్చి గుజరాత్ ఎన్నికల వ్యూహాల్లో చురుగ్గా పనిచేశారు.2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) టీం లో ఈయన ఒక మెంబర్. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని మెజారిటీ సంపాదించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత సునీల్ ఉత్తర ప్రదేశ్ బీజేపీ కి రాజకీయ వ్యూహకర్త గా పనిచేశారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ విజయ ఢంకా మోగించింది. 2019 లో స్టాలిన్ పార్టీతో జతకట్టి డిఎంకె పార్టీ 38 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో సునీల్ పేరు దక్షిణాదిన మారుమోగింది.

ఇక సొంత రాష్ట్రం కర్ణాటకలో కొద్దిరోజులపాటు బీజేపీతో కలిసిన సునీల్ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లోకి మకాం మార్చారు. గతేడాది ఆ రాష్ట్ర పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో బీజేపీ సునీల్ ని ఆహ్వానించినా అటువైపు వెళ్ళలేదు. గతేడాది నుంచి కాంగ్రెస్ ను ఎన్నికలకు సునీల్ సిద్ధం చేశారు. తనదైన వ్యూహాలు రచిస్తూ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను పోగొట్టారు. పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్( DK Shivakumar), ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య లను ఏకం చేసి తన వ్యూహాలను అప్లై చేశారు. బీజేపీ ప్రభుత్వంలోని లోటుపాటులే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచార షెడ్యూల్ ప్లాన్ చేశారు. బొమ్మై ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటుందంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ‘పేసీఎం’ అంటూ ప్రచారం లో బొమ్మై ని కాంగ్రెస్ విమర్శించడం మొదలుపెట్టింది.

బీజేపీ ప్రభుత్వం కన్నడ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా సామాన్య ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో గృహలక్ష్మి, ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత రవాణా వంటి అంశాలను చేర్చడం కూడా సునీల్ వ్యూహంలో భాగమే. ఈ రకంగా కాంగ్రెస్ పేద ప్రజలను ఆకర్షించింది. పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడం కూడా ఆషామాషీగా జరగలేదు. కార్యకర్తలందరి గురించి సునీల్ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వారి వారి నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న విషయంపై సర్వే చేశారు. ప్రజాదరణ దక్కించుకున్న నేతలకే టికెట్లు ఇచ్చారు. ఆయన వ్యూహం అధ్యయనం ఫలించి కన్నడ నాట కాంగ్రెస్ 135 స్థానాలు కైవసం చేసుకుంది. ఆయన వ్యూహాలను నచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేయడానికి లోక్ సభ ఎలక్షన్స్ టాస్క్ ఫోర్స్ టీం లో ఆయన్ని సభ్యున్ని చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...