గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏయే అంశాలపై చర్చిస్తున్నారో మీడియాకి ముందే లీకయిపోతోంది. ఆ మీడియా, ఈ మీడియా అన్న తేడాల్లేవు.. ప్రధాన మీడియా సంస్థలకు లీకులు అందుతున్నాయి. ఎలా.? సాధారణంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతుంటుంది. ఆయా అంశాలపై తమకు అందే సమాచారాన్ని విశ్లేషించి కథనాలు అందించడం మీడియా రంగంలో కొత్తేమీ కాదు. అయితే, గవర్నర్ వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంతరంగికంగా చర్చించే విషయాలు ఎలా మీడియాకి లీకవుతున్నాయి.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పుడీ అంశంపై ఏకంగా సీబీఐ విచారణ కోరుతున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి సహా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా ప్రతివాదులుగా చేర్చారట నిమ్మగడ్డ రమేష్ కుమార్. దాంతో, ఇప్పడీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయబోతున్నారు. మరోపక్క ఆయన మీద మంత్రుల ఫిర్యాదు నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ ఓ నోటీసు కూడా జారీ చేసింది. సరిగ్గా ఇదే సమయంలో ‘లీకులపై’ నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంతకీ లీకులు ఎలా బయటకు వస్తున్నాయి.? ‘టీడీపీకి, టీడీపీ అనుకూల మీడియాకి స్వయంగా నిమ్మగడ్డ లీకులు పంపుతున్నారు’ అన్నది వైసీపీ చాలాకాలంగా చేస్తోన్న ఆరోపణ.
కాదు కాదు, నిమ్మగడ్డపై నిఘా పెట్టిన ప్రభుత్వం ఆయనకు సంబంధించిన అన్ని విషయాలనీ తమ అనుకూల మీడియా ద్వారా లీకులు చేయిస్తోందన్నది టీడీపీ ఆరోపణ. వీటిల్లో ఏది నిజం.? వ్యవహారం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది గనుక.. నిజాలు నిగ్గు తేలాల్సిందే. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి వున్నన్ని అధికారాలు దాదాపుగా వుంటాయి. దాంతో, కేంద్ర హోంశాఖ కూడా రంగంలోకి దిగుతుందా.? సీబీఐ విచారణ తప్పదా.? వేచి చూడాల్సిందే.
468403 892286Thank you for the auspicious writeup. It in fact was a amusement account it. Appear advanced to a lot more added agreeable from you! Nonetheless, how could we communicate? 837569
760872 821242You must join in a tournament 1st with the greatest blogs on the internet. I will recommend this web site! 293957
446927 127366There several intriguing points over time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I appear into it further. Extremely good post , thanks and now we want more! Included with FeedBurner at the same time 89076