Samantha: సౌత్ ఇండస్ట్రీలో దశాబ్దానికిపైగా టాప్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతోంది హీరోయిన్ సమంత (Samantha) . సినిమాలతో మాయ చేసే సమంత సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూంటుంది. తన ఆరోగ్యం, ట్రావెలింగ్, సినిమాల విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈక్రమంలో ఓ నెటిజన్.. ఆమెకు ‘మీరు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు’ అనే ప్రశ్న వేశాడు. దీనికి తనదైన రీతిలో గణాంకాల సాయంతో సమాధానం ఇచ్చింది సమంత.
‘కీ డివోర్స్ స్టాటస్టిక్స్ ప్రకారం పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ (స్మైలీ ఇమేజ్ జోడిస్తూ)’ తన ఉద్దేశాన్ని చెప్పారు. సమంత చెప్పినదాని ప్రకారం 2023లో మొదటి పెళ్లి విడాకులు 50శాతం ఉండగా.. రెండో పెళ్లి విడాకులు 67శాతం.. మూడో పెళ్లి విడాకులు 73శాతం ఉన్నాయి. స్త్రీ, పురుషుల విషయంలో ఈ రేటింగ్ ఇలానే ఉందని చెప్పుకొచ్చింది. దీంతో సమంత ఉద్దేశంలో పెళ్లి.. లేదా మళ్లీ పెళ్లిపై ఉన్న క్లారిటీ ఇదేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.